ఆ షూట్ సమయంలో తిండి కూడా స‌రిగా తిన‌లేదు.. తీరా చూస్తే మూవీ ఫ్లాప్.. అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో అల్లరి నరేష్ ఒకరు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపిన అల్లరి నరేష్.. ప్రస్తుతం లిమిటెడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తూ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న ఈ అల్ల‌రోడు సినీ కెరీర్‌లో ఎన్నో ఫ్లాప్‌లు చెవి చూసాడు. అయితే తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన నటించిన సినిమాల్లో ఫ్లాప్ గా నిలిచిన లడ్డు బాబు సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆ సినిమా షూట్ టైంలో ఆయన ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వివరించాడు. నేను.. సినిమా చూసి గమ్యం, మహర్షి సినిమాలో ఆఫర్లు వచ్చాయని ఆయన వివరించాడు.

Laddu Babu (2014) - IMDb

సుడిగాలి తర్వాత నా సినిమాలపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పుకొచ్చాడు. లడ్డు బాబు సినిమాలో నేను నటించినట్టే లేదని చాలామంది అన్నారని.. ఆ సినిమా కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ వివరించారు. లడ్డు బాబు మూవీ షూటింగ్ టైంలో మేకప్ కే చాలా సమయం పట్టేదని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా టైంలో మేకప్ హెవీ కావడంతో రాషెస్ వచ్చేవని.. మేకప్ ఉండడంతో చెమటల వల్ల కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. లడ్డు బాబు కొత్త తరహా సినిమా అవుతుందని భావించా.. అందుకే ఈ సినిమాలో నటించానంటూ చెప్పుకొచ్చారు. ఉదయం నాలుగు గంటల లోపే తినాలి తప్ప.. మేకప్ వేసిన తర్వాత సాలిడ్ ఫుడ్ తినలేము అని.. ఆయన చెప్పుకొచ్చాడు.

Aa Okkati Adakku (2024) - Movie | Reviews, Cast & Release Date in mumbai-  BookMyShow

తిండి కూడా సరైన సమయానికి తినకుండా సినిమా కోసం కష్టపడినట్లు వివరించాడు. ఉదయం మేకప్ కు నాలుగున్నర గంటలు పడితే.. సాయంత్రం మేకప్ ను తీసివేయడానికి 90 నిమిషాలు పట్టేదని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా షూట్ ఆరు రోజులు సరైన ఆహారం కూడా తినలేదు అంటూ వివరించాడు. కాగా ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం నరేష్ ఆ ఒకటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. జాతి రత్నాలు బ్యూటీ ఫ‌రీయా అబ్దుల్లా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ క్రమంలో పలు ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అల్లరి నరేష్ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటున్నాడు. అయితే అల్లరి నరేష్ లడ్డు బాబు షూటింగ్లో జరిగిన తన అనుభవాలను షేర్ చేసుకున్న ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఈ సినిమా హిట్టై ఉంటే ఆయన కష్టానికి సరైన ఫలితమైన దక్కేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.