ఓ మై గాడ్: బెంగుళూరు రేవ్ పార్టీలో ఆ స్టార్ హీరో కూతురు కూడా ఉందా..?

బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంతలా అంటే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలోను ఈ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. స్టార్ సెలబ్రిటీస్ సరదాగా వీకెండ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా కొంతమంది పబ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తే మరి కొందరు ఇంట్లోనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం విచ్చలవిడిగా హద్దులు మీరి పోయిన డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

తాజాగా బెంగళూరులో అదే జరిగింది . అయితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో బడా బడా ప్రముఖులు కూడా ఎంజాయ్ చేసినట్లు కొన్ని పిక్స్ వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా బెంజ్ కార్ కూడా ఈ రేవ్ పార్టీలో దర్శనం ఇవ్వడం సంచలనంగా మారింది . బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్ పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేయడంతో ఈ విషయం బయటపడింది. జి ఆర్ ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున రెండు గంటల మూడు గంటల మధ్యన ఈ పార్టీ జరిగినట్టు సమాచారం అందుతుంది .

అంతేకాదు ఈ రేవ్ పార్టీలో భారీ ఎత్తున కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారట పోలీసులు. ఏపీ తెలంగాణ నుంచి స్టార్ సెలబ్రిటీస్ మొత్తం 100 మందికి పైగా హాజరైనట్లు పోలీసుల విచారణలో బయటపడింది . అంతేకాదు ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ స్టార్ హీరో కూతురు అదే విధంగా ఒక అవార్డు విన్నింగ్ డైరెక్టర్ కూడా ఉన్నట్లు కన్నద మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీని రేవ్ పార్టీ షేక్ చేసి పడేస్తుంది..!!