‘ కన్నప్ప ‘ లో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..?!

మంచు మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా పాన్ ఇండియా లెవెల్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ కన్నప్ప. ఈ సినిమా భారీ తారాగణంతో నక్షత్ర పాలపొంతను తలపించే విధంగా ఉంది. మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైథాలజికల్ మూవీ గా రూపొందనున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్ లాంటి స్టార్ న‌టులు కీలక పాత్ర పోషించనున్నారు.

First Look Posters : Kannappa (Vishnu Manchu)

ఇప్ప‌టికే ఈ సినిమాలో న‌టిస్తున్న సెల‌బ్రెటీల లిస్ట్ ప్రేక్ష‌కుల‌లో సినిమా పై మంచి హైప్ తెచ్చింది. తాజాగా మరో సూపర్ స్టార్ ఈ ప్రాజెక్టులో చేరారంటూ వార్తలు వినిపించాయి. ఆయన మ‌రెవరో కాదు మోహన్‌లాల్. ఇందులో ఆయన ఆదివాసి తెగకు చెందిన ఓ నాయకుడిగా కనిపించనున్నాడని టాక్. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌స్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌.

I respect item songs," says Tamannah.

ఇదిలా ఉంటే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా కన్నప్పలో భాగమైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఆమెను సెలెక్ట్ చేశారట మేకర్స్. రజనీకాంత్ జైలర్ సినిమాలో ఆమె పర్ఫార్మ్ చేసిన స్పెషల్ సాంగ్ ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కన్నప్పలో కూడా ఈ రేంజ్ లో స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకుంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వార్తలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.