ఒకే సాంగ్ లో ముగ్గురు భామలతో ప్రభాస్.. మోత మోగిపోవాల్సిందే..?!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక హీరోతో ఇద్దరు హీరోయిన్లు కలిసి ఆడి పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఇలా ఇద్దరు హీరోయిన్లు.. ఒక హీరో ఉన్న సినిమాలు చాలా కామన్ గా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కు అంతగా క్రేజ్ లేదు. కాగా ప్రభాస్ మరో కొత్త ట్రెండ్‌ను మొదలుపెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం ఏకంగా ముగ్గురు భామలతో పర్ఫామెన్స్ చేయనున్నాడట. నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహన్ ఈ ముగ్గురితో ఒకే పాటలో ప్రభాస్ మాస్ స్టెప్‌ల‌తో అదరగొట్టనున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Prabhas announces his next Pan-Indian film 'The Raja Saab' - The Economic  Times

మిర్చి తర్వాత ప్రభాస్ హీరోయిన్లతో స్టెప్పులు వెయ్యలేదు.. పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సినిమాలకు ప్రభాస్ దూరమయ్యాడనే చెప్పాలి. అయితే తాజాగా డైరెక్టర్ మారుతి పుణ్యమా అని మళ్లీ మరోసారి మిర్చి నాటి ప్రభాస్ ని తెలుగు ప్రేక్షకులకు గుర్తు చేయనున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ ఈ ముగ్గురితో కలిసి చేసే డ్యాన్స్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ గా ఉండబోతుందని.. ఈ సాంగ్ ధియేటర్స్ లో వచ్చినప్పుడు ఫాన్స్ రిజల్ట్స్ మోత‌ మోగిపోవడం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Raja Deluxe: Prabhas to romance these 3 actresses in Maruthi's film |  Telugu Movie News - Times of India

పైగా ప్రభాస్ నటిస్తున్న మొదటి కామెడీ హర్రర్ మూవీ ఇదే కావడంతో.. సినిమా పై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. మారుతి ప్రేమ కథ సినిమా తరహాలో హారర్ కామెడీ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. అలాంటి డైరెక్టర్ ప్రభాస్ లాంటి సూపర్ స్టార్‌తో మరోసారి కామెడీ హారర్ తెరకెక్కించడం అంటే ఇది నిజంగానే పెద్ద‌ ఎక్స్పరిమెంట్ అని చెప్పాలి. ఇక బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఇందులో కీ రోల్ ప్లే చేయనున్నాడు.