మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జక్కన్న డైరెక్షన్లో షూటింగ్ మొదలయ్యేది ఆ స్పెషల్ రోజే..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ తెర‌కెక్క‌న్నున‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఎప్పుడెప్పుడు కొత్త అప్డేట్లు వస్తాయా అంటూ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు వేదికలపై స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తాను అలాగే డైరెక్టర్ రాజమౌళి దక్షిణాఫ్రికా నవల రచయిత విలబర్ స్మిత్‌కు చాలా పెద్ద ఫ్యాన్స్ అని.. ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ స్క్రిప్ట్‌ను రాశామని వివరించారు. హనుమంతుని లక్షణాలతో మహేష్ బాబు పాత్రను ఈ సినిమాలో డిజైన్ చేసినట్లు వివరించాడు.

Mahesh Babu | Mahesh Babu stylish look♥️🥰 . . . . .. . . . . . . . . . . .  . . . . . . . . . . . ..#keertysuresh #keertysuresh😘😍💕💫 ... | Instagram

ఇదిలా ఉంటే ఇందులో మహేష్ కి జోడిగా ఓ విదేశీ భామ నటిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆమెతోపాటు ఆలియా భట్ మరో కీలక పాత్రలో నటించనుందట. అది హీరోయిన్ పాత్ర.. లేదా ఏదైనా ప్రత్యేక పాత్ర.. అనేదానిపై ఇటువంటి సమాచారం లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై మరో అప్డేట్ నెటింట‌ వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రెస్‌మీట్ ను మేకర్స్ ఓ స్పెషల్ రోజున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.

SS Rajamouli resumes shooting 'RRR' with Ram Charan, Jr NTR

అదే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన మే 31. ఈ సినిమా మొదటి ప్రస్ మీట్ మే31న‌ ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆ రోజు నుంచి సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచారం. రాజమౌళి అదే రోజున సినిమా స్టార్ట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి స్వరాలు అందించనున్నారు అన్న సంగతి తెలిసిందే. కే.ఎల్. నారాయణ ఈ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్‌ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.