వాట్.. వరలక్ష్మి ఈ రెండు హిట్ సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుందా.. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే..?!

హిరోయిన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి.. తర్వాత సపోర్టింగ్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇటీవల తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటి దక్కించుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు.. ఓ సినిమాలో నటిస్తుంటే కచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది అనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో మొదలైంది. ఇక తండ్రి.. హీరో శరత్ కుమార్ కు తగ్గట్టుగానే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈ అమ్మడు.. రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో ఆకట్టుకుంది.

Varalakshmi Sarathkumar Interview Photos

ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస అవకాశాలు అందడం.. ఈమె నటించిన ప్రతి సినిమా హిట్ కావడంతో వరలక్ష్మి స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఇక హనుమాన్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ అమ్మడు.. ప్రస్తుతం శబరి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది వరలక్ష్మి. ఈ ఇంట‌ర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్‌కు ఇంటర్వ్యూవ‌ర్ నుంచి ప్రశ్న ఎదురైంది.

Premisthe (2005) | V CINEMA - Movie, Review, Cast, Songs & Release Date

సులభంగా ఇండస్ట్రీ లోకి రాలేదు.. ఎన్నో ఆడిషన్స్, అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ ఫోటోలు పట్టుకొని తిరగడం లాంటివి జరిగాయని విన్నాం. అలాగే శంకర్ డైరెక్షన్‌లో బాయ్స్, ప్రేమిస్తే సినిమాలో మీకు హీరోయిన్గా అవకాశం వచ్చిందట కదా అంటూ ఇంటర్వ్యూవర్ ప్రశ్నించాడు.

Boys Songs | Listen to Boys Audio songs | Boys mp3 songs online | Telugu

అయితే అప్పట్లో హీరోయిన్గా ఇలాంటి సినిమాల్లో నటించి ఉంటే మీ కెరీర్ మరింత ఫామ్ లో ఉండేదని.. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అని ప్రశ్నించగా.. అనుకోని కారణాలతో ఆ సినిమాలను మిస్ చేసుకోవాల్సి వచ్చిందని.. అయితే అప్పట్లో హీరోయిన్గా చేసి ఉంటే ఇప్పటికీ ఫేడౌట్ అయిపోయేదాన్నేమో.. ఇలా ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్ అయితే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయవచ్చు అంటూ వరలక్ష్మి వివరించింది. ప్రస్తుతం వరలక్ష్మి చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్ గా మారడంతో.. రెండు హిట్ సినిమాల్లో అవకాశాలను వరలక్ష్మీ మిస్ చేసుకుందా అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్స్.