వేసవిలో అధిక రక్తపోటు సమస్య.. ఈ ఆరు ఆహారాల‌తో ఇట్టే చెక్..?!

అదిక రక్త‌పోటు సమస్యతో ఇబ్బంది పడేవారు.. తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వేసవి సమయంలో ఉష్ణోగ్రత పెరిగి శరీరంలో తగిన లెవెల్లో వాటర్ ఉండకపోవడంతో.. హైడ్రేషన్ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ సమస్య తీవ్రత మరింతగా పెరుగుతూ ఉంటుంది. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గి డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు.. అధిక రక్తపోటు సమస్య తలెత్తే ఛాన్స్ ఉంటుంది. కనుక వేసవిలో రక్తపోటు అధికంగా కాకూడదంటే.. తప్పకుండా ఈ ఆహార పదార్థాలను తీసుకోవాలి. వేసవిలో అధిక రక్తపోటుతో బాధపడేవారు తప్పకుండా ఉదయం ఆహారంలో అరటిపండును తీసుకుంటూ ఉండాలి.

Banana And Pomegranate at best price in Chennai by Limbani Farms | ID:  18966796733

ఇందులో శరీరానికి కావాల్సిన పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బలంగా మారి రక్తపోటు సమస్యను నియంత్రణలో ఉంచుతుంది. పెరుగును కూడా తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో ఉండే పొటాషియం, కాల్షియం అధిక రక్తపోటుతో బాధపడే వారికి సులభంగా నియంత్రించుకోవడానికి సహకరిస్తుంది. పొట్ట సమస్యలు రాకుండా చెక్ పెడుతుంది. అలాగే దాని మన ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

Coconut water vs Lemon Water: नारियल पानी पिएं या नींबू पानी, गर्मियों में  क्या है ज्यादा फायदेमंद? - Coconut water vs Lemon Water Which is better in  Summer nariyal pani ya nimbu

కనుక రక్తపోటుతో ఇబ్బంది పడేవారు.. దానిమ్మ గింజలను రోజు తీసుకోవడం వల్ల అధిక రక్త‌పోటు నార్మల్ అవుతుంది. అలాగే గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చు. డిహైడ్రేట్ సమస్య కారణంగా కూడా బ్లడ్ ప్రెషర్ అధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతిరోజు ఉదయం కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి.. ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేయడానికి సహకరిస్తాయి.

Watermelon Fries (Viral Recipe) - Eating Bird Food

అలాగే వేసవిలో అందరూ ఎక్కువగా ఇష్టంగా తినే ఫ్రూట్స్లో పుచ్చకాయ ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి సహకరిస్తుంది. హైబీపీని నియంత్రించేందుకు.. అలాగే ఇందులో ఉండే మెగ్నీషియం హైపర్ టెన్షన్ బ్యాలెన్స్ చేసేందుకు సహకరిస్తుంది. నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే ఫ్రూట్స్లో ఒకటి. నిమ్మరసం ప్రతిరోజు తీసుకోవడం వల్ల ప్రిరాడికల్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.