మోకాళ్ళ నొప్పులకు చింతగింజలు దివ్య ఔషధంలా పనిచేస్తాయని తెలుసా.. ఎలా వాడాలంటే..?!

వయ‌స్సు పై బ‌డుతున్న కొద్ది మోకాళ్ళ నొప్పుల సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇటీవల బిజీ లైఫ్ స్టైల్, ఆహార విధానాలతో ముందు నుంచే వీక్ గా ఉంటున్నారు. యూత్ లో కూడా మోకాళ్ళ నొప్పులతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మెట్లు ఎక్కాలున్నా, ఎక్కువసేపు నిలబడాలన్న, నడవాలన్న ఎంతో నొప్పిగా ఫీల్ అవుతూ ఉంటున్నారు. ఈ క్రమంలో మోకాళ్ళ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ.. లేనిపోని సమస్యలను తెచ్చుకుంటున్నారు. అయితే సహజంగా మోకాళ్ల నొప్పులను వదిలించుకోవచ్చు.

దానికి చింత గింజలు ఎంతగానో సహకరిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దాదాపు వేసవికాలం వచ్చిందంటే చాలామంది ఇళ్లలో చింతపండు, చింతగింజలు విరివిగా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది చింత గింజలు పనికిరావ‌ని అమ్మేస్తారు. అయితే చింత గింజలు ఔషధ గని అని చాలామందికి తెలియదు. ఆరోగ్యానికి అవి ఎంతగానో మేలు చేస్తాయి. చింతగింజలతో ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడేవారు ఒక గ్లాసు వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ చింత‌గింజలు పొడి వేసి.. మరిగించుకొని ఆ వాటర్ ను స్ట్రైన సహాయంతో ఫిల్టర్ చేసుకొని తాగుతూ ఉండాలి. ఇలా కొద్ది రోజులు వరుసగా చేయడంతో ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. ఎముకల బలహీనత దూరమై మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. పైగా చింతగింజల పొడి వేసి మరిగించిన నీటిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి.