రెండో పెళ్లి అంటూ కాబోయే భర్త పై ట్రోల్స్.. వరలక్ష్మి రియాక్షన్ చూస్తే దెబ్బకు నోరు మూస్తారు..?!

స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీకి పరిచయమై భారీ పాపులాటి దక్కించుకున్న‌ వరలక్ష్మి శరత్ కుమార్ కు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలో అయినా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు తాజాగా తేజా సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీలో కీలకపాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన శ‌బ‌రి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇక పర్సనల్ విషయానికి వస్తే తాజాగా నికోలయి సచిదేవ్ అనే వ్యక్తిని నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది ఈ అమ్మడు.

Varalaxmi Sarathkumar | Engaged 💍 Love laughter and Happily Ever After  #nicholaisachdev #blessed #love #engaged #family @r_sarath_kumar  Photography @theaa... | Instagram

వీరికి సంబంధించిన ఫొటోస్ నెటింటా వైరల్ గా మారడంతో నీకోల‌యి వివరాలు నెట్టింట వైరల్ గా మారాయి. అతనికి గతంలో ఒక్కసారి పెళ్ళై.. ఒక కూతురు కూడా ఉన్నట్లు వార్తలు వినిపించడం.. ఫోటోలు కూడా వైరల్ గా మారడంతో వరలక్ష్మి రెండో పెళ్లి వాడిని చేసుకుంటుందంటూ దారుణంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. తాజాగా ఈమె నటించిన శబరి మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న వరలక్ష్మి కాబోయే భర్త పై వచ్చే ట్రోల్స్ గురించి స్పందించింది. నేను నీక్‌తో నిశ్చితార్థం చేసుకున్నప్పటి నుంచి సెకండ్ మ్యారేజ్.. పాప ఉంది అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. అయితే నాకు మాత్రం అతను హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. నిక్‌ ఒక్కడే రెండో పెళ్లి చేసుకోలేదు.. చాలామంది పెళ్లి చేసుకుంటున్నారు.

Is Varalaxmi's future husband already married and has children? - Here's  what we know - Tamil News - IndiaGlitz.com

మా నాన్న కూడా రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. అయినా హ్యాపీగా ఉండే అంతవరకు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. కనుక మా బంధం పై వస్తున్న ట్రోల్స్ నేను లెక్క చేయను. అసలు వాటికి నేను సమాధానం చెప్పాల‌నుకోను. ఆ అవసరం కూడా నాకు లేదు. ఇక నిక్‌ మాజీ భార్య నాకు తెలుసు. ఆమె వ్యక్తిత్వం చాలా మంచిది. విక్‌, అతని కూతురు పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు. ఇక నిక్‌ నాకు 14 ఏళ్ల నుంచి తెలుసు. మేము మంచి స్నేహితులం. అదే తాజాగా ప్రేమగా మారింది. త్వరలోనే భార్యాభర్తలు కాబోతున్నాం. అతను నన్ను హ్యాపీగా ఉంచుతారు. నా కెరీర్ విషయంలో ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. జీవితాంతం నిక్‌తో సంతోషంగా ఉంటానని నమ్మకం నాకుంది. అందుకే పెళ్లి చేసుకుంటున్నా. కనక ట్రోల్స్ ఎన్ని వచ్చినా పట్టించుకోనంటూ వివరించింది.