75 కేజీల మనిషిని పైన పడుకోబెట్టుకొని అలా చేయడం అంత సులువు కాదు.. మంగ‌ళ‌వారం న‌టి షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలో నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న మూవీ మంగళవారం. మర్డర్ మిస్టరీగా వ‌చ్చిన‌ ఈ సినిమా ఎలాంటి స‌క్స‌స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపిన‌ ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. హారర్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ పాత్ర తర్వాత అదే రేంజ్‌లో హైలైట్ అయిన రోల్ జమీందారి భార్య పాత్ర.

Mangalavaaram (2023)

మలయాళ నటి దివ్య పెళ్ళై ఈ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో పవిత్రంగా కనిపిస్తూ, గుడులు తిరుగుతూ.. పూజలు చేస్తూ సాంప్రదాయంగా ప్రేక్షకులను మెప్పించింది.. అంత‌లోనే పనిమనిషితో అక్రమ సంబంధం పెట్టుకొని శృంగార సన్నివేశాల్లో నటించి విలన్ గాను కనిపించింది. ఇక తాజాగా దివ్య పిళ్ళై ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. మంగళవారం సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వివరించింది.

Divya Pillai

సెట్స్ లో అందరి ముందు శృంగారం సీన్స్ నటించడం అంటే అంత సులువు కాదని.. 75 కేజీల బరువున్న ఓ మనిషిని మనపై పడుకోబెట్టుకొని బరువే లేనట్టు రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చాలా కష్టంగా అంటూ చెప్పుకొచ్చింది. ఎంత కష్టమైనా ఆ ఫీలింగ్స్ ను ముఖంలో అస్సలు చూపించకూడదని.. రొమాంటిక్ సన్నివేశాలు నటించే ముందు కో స్టార్స్‌తో ముందే చర్చించాలని.. దివ్య పెళ్ళై వివరించింది. చివర్లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తున్న సమయంలో హే మొద్దు భలే ఉందని ఎంజాయ్ చేయడం లాంటిది ఏమి ఉండవు అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.