సావిత్రి, శ్రీదేవి లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు.. అతడి పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

టాలీవుడ్ యాక్టర్, రైటర్ తోటపల్లి మధు ఎన్నో సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దివంగత నటలు సావిత్రి, శ్రీదేవి, శోభన్ బాబు, జయలలిత, కోడ్డి రామకృష్ణ లాంటి వారిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. వారి గురించి వివరిస్తూ మందు తాగడం వల్లే వీరంతా చనిపోయార‌న‌ట్లు చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో డైరెక్టర్ దేవి ప్రసాద్ దీనిపై స్పందిస్తూ మధు పై ఫైర్ అయ్యారు. ఎంత గొప్ప సినిమా అయినా కాగితంపై రాసే కథతోనే ప్రారంభమవుతుందని.. అందుకే రచయితకి ఎప్పుడూ నేను అగ్ర‌స్థానం ఇస్తానంటూ వివరించాడు.

రచయిత స్థాయి వయసుతో సంభంధం లేకుండా వారిని గౌరవిస్తా అందరూ గౌరవించాలని భావిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సీనియర్ రచయిత తోటపల్లి మధు గారి ఫోటో షేర్ చేస్తూ ఇదిగో ఈ ఫోటోలో ఉన్న సీనియర్ రచయిత గారి లాంటి వారు మాత్రం కొంత ప్రత్యేకమని.. వీరికి కొన్ని స్పెషల్ టాలెంట్లు ఉన్నాయంటూ వివరించాడు. మీడియా.. మైక్ పెట్టి కెమెరా ఆన్ చేస్తే వీరు ఎంత సాధించిన వారినైనా.. ఎలాంటి వారినైనా వాడు, వీడు అని సంబోధించగలరని.. జంధ్యాల గారు, సావిత్రి గారు, శ్రీదేవి గారి లాంటి ఎంతో ఉత్తమ నటులనైనా అసలు ఎందుకు మందు బానిస అయ్యారో.. రోజుకు ఎన్నిసార్లు తాగారో కళారా చూసినట్లు వివరించగలరని.. అసలు శ్రీదేవి గారు చనిపోయే ముందు ఏమేమి ఎలా జరిగిందో అక్కడే ఉండి చూసినట్లే ఈయన వివరించగలరని చెప్పకొచ్చాడు.

త‌మిళ్‌ ఎంజీఆర్ గారు స్విస్ బ్యాంకు లో దాచిన రూ.3000 కోట్ల వివరాల చిట్టిని.. ఆయన తన తల పైన టోపీలో దాచుకుంటే జయలలిత గారు దాన్ని తీసి.. శోభన్ బాబు గారికి ఇస్తే.. ఆయన భూములు కొని ఎలా లాభాలు పొందారో ప్రత్యక్ష సాక్షిలా వివరించగలరని.. అద్భుతమైన నటనను కనబరిచే ఈయన దృష్టిలో జస్ట్ వందల సినిమాల్లో మాత్రమే నటించి నంది అవార్డులు పొందిన సీనియర్ నటులు మురళీమోహన్ గారు అసలు నటుడే కాదని చెప్పుకొచ్చారు. దివంగత నటుడు మిక్కిలినేని గారి లాంటి ఉత్తమ నటులను అపహాస్య చేయడమే కాదు.. వీరికే అవకాశాలు ఇచ్చే ఉపాధి కల్పించిన కోదండరామిరెడ్డి గారి లాంటి స్టార్ డైరెక్టర్ల ప్రతిభకు కూడా వ్యంగ్యంగా మరకలు అర్ధగలరంటూ ఫైర్ అయ్యాడు.

Devi Prasad: టాలీవుడ్ రైటర్ కి డైరెక్టర్ వార్నింగ్.. అవాకులు పేలితే అంతే అంటూ! - NTV Telugu

అసలు మందు వాసన తెలియని ఈయన ఇప్పుడు ఇండస్ట్రీలో మందు దాటి.. అందరూ డ్రగ్స్ విరివిగా వాడేస్తున్నారని.. అవి కూడా డాక్టర్ల ఇస్తున్నారు అంటూ చూసినట్లే చెప్పి.. అన్నం పెడుతున్న ఇండస్ట్రీ నే ఎంతవరకైన దిగజార్చగలరు అంటూ చెప్పుకొచ్చాడు. వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన మా గురువుగారు.. కోడి రామకృష్ణ గారి మీద కూడా అబద్ధాలు.. అప‌హ‌స్య మాట‌లు పేల్చగలరని చెప్పుకొచ్చాడు. అయితే అతనికి తెలియనిది ఏంటంటే మా గురువుగారు లోకంలో లేకున్నా.. ఆయన శిష్యుల మేమింకా బ్రతికే ఉన్నామని.. తోటపల్లి మధుగారిలో ఇప్పటికైనా పశ్చాత్తాపం రాకుంటే.. వారికున్నంత సంస్కారం, ప్రతిభ మాకు లేకున్నా వారి అసహ్యకర, జుగుప్సాకర లీలలు అప్పటినుంచి ఇప్పటివరకు ఈయన చేసిన విన్యాసాలన్నీ వివరించి.. అందరితో ప్రశాంస‌లందుకోక తప్పదని రాసుకొవచ్చాడు.

అలాగే ఆయనను ఇంటర్వ్యూ చేసిన యాంకర్ స్వప్న గురించి మాట్లాడుతూ.. వారి అబద్దపు మాట‌ల‌ మధ్యలో పట్టరాని నవ్వులతో ప్రేక్షకులను అలరించిన యాంకర్ స్వప్న గారి సంస్కారం కూడా తక్కువేమీ కాదంటూ వివరించాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింటే వైరల్ అవ్వడంతో.. నెటిజన్స్ అంతా తోటపల్లి మధు పై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారి వాగుడు ఎవరు పట్టించుకోరు అంటూ.. ఉన్నతమైన నటుల గురించి మాట్లాడితే ఎవరు సహించరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.