క్యాస్టింగ్ కౌచ్ పై అనసూయ షాకింగ్ కామెంట్స్.. ఆ కోరికతో దగ్గరకు వస్తే ఇలానే చేస్తా అంటూ..

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య ఎప్ప‌టినుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్.. హీరో, హీరోయిన్‌లు క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నట్టు తమ అనుభవాలను.. ఇంటర్వ్యూలు లేదా సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా టాలీవుడ్ బుల్లితెర బోల్డ్ యాంకర్ అనసూయ కూడా తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాజాగా అనసూయ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. ఆ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ.. అలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆమె ఎలా ప్రవర్తిస్తుందో చెప్పుకొచ్చింది.

ఒక సినిమా గురించి మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఎదుటివారి ఉద్దేశం మనకు మొదటి మూడు నిమిషాల్లోనే అర్థమవుతుందని.. మన నుండి ఏదైనా ఆశిస్తున్నారని మనకి అర్థం అయినప్పుడు నేనైతే నా ఫ్యామిలీ, పిల్లలు, హస్బెండ్ గురించి వారి ముందు మాట్లాడతానని.. అప్పుడు వాళ్ళు ఈ టాపిక్ నా ముందుకు తీసుకురారంటూ వివరించింది. మనం ఇండస్ట్రీలో ఉండాలి జర్నీ కొనసాగాలి.. అంటే ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకుండా లౌక్యంగా మాట్లాడాలని.. భవిష్యత్తులో వారు ఎదురైనా ఇబ్బంది పడే పరిస్థితి మనకు ఉండకూడదు అంటూ వివరించింది. కమిట్మెంట్ విషయంలో కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్లు వ్యవహరించాలని అనసూయ చెప్పుకొచ్చింది.

అయితే అనసూయ స్వతహాగా ఈ మాటలకు చాలా విరుద్ధంగా ఉంటారు. ఫైర్ బ్రాండ్ లా ముక్కు సూటిగా మాట్లాడుతూ తనపై వచ్చే కామెంట్స్, ట్రోల్స్ పై ఫైర్ అవుతూ ఉంటారు. అలాంటి అనసూయ కమిట్మెంట్స్ అడిగే వాళ్ళ నుంచి తెలివిగా తప్పుకోవాలని పరోక్షంగా వివరించింది. గొడవలు పడడం సరికాదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం యాంకరింగ్ కి అనసూయ గుడ్ బాయ్ చెప్పేసి పూర్తిగా నటిగా సెటిలైపోయింది. వరుస‌ సినిమా ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతున్న ఈ అమ్మడు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2లో పవర్ఫుల్ లేడీ విలన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఇతర భాషల్లో కూడా ఆఫర్లను అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.