ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నది టాలీవుడ్ స్టార్ హీరో భార్య.. తెలుగు ఆడియన్స్ ఫేవరెట్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు టాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్. మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకుని యూత్ కు బాగా కనెక్ట్ అయిన ఈ అమ్మడు.. తనదైన నటనతో, అందంతో మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు, మలయాళం లో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆడియన్స్ ఫేవరెట్ బ్యూటీ. హీరోయిన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఓ టాలీవుడ్ టాప్ హీరో అని ప్రేమించి వివాహం చేసుకుంది. కాగా పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా చెక్ పెట్టింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

Actress Amala Akkineni : அதுக்குள்ள 56 வயசு ஆகிடுச்சா.. ஆனா பார்த்தா அப்படி  தெரியல - கணவரோடு பர்த்டே கொண்டாடிய கிளாசிக் குயின் அமலா!

ఆమె మరెవరో కాదు అక్కినేని నాగార్జున వైఫ్ అక్కినేని అమల. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన త్రో బ్యాక్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. కిరాయి రౌడీ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అమల. ఇందులో నాగార్జున హీరోగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత వెంకీతో రక్త తిలకం, అగ్గిరాముడు. చిరంజీవితో రాజా విక్రమార్క, రాజశేఖర్ తో ఆగ్రహం ఇలా పలు సినిమాల్లో నటించి ఆక‌ట్టుకుంది. అలాగే నాగార్జున సరసన చిన్నబాబు, శివ, నిర్ణయం, ప్రేమ బంధం లాంటి హిట్‌ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ఈ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్యన ప్రేమ చిగురించడం.. దీంతో వీరు పెద్దల సమక్షంలో వివాహం చేసుకుని ఒకటవ్వడం జరిగింది.

Nagarjuna celebrates birthday with son Akhil, wife Amala, poses for family  pic - Hindustan Times

1992లో నాగార్జున ను పెళ్లి చేసుకున్న అమల.. అఖిల్ కు జన్మనిచ్చింది. ఇక అఖిల్ సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఊహించిన సక్సెస్ ఒకటి ద‌క్క‌లేదు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అమ‌లా బ్లూ క్రాస్ అనే పేరుతో జంతు పరిరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి జంతువులను రక్షిస్తుంది. ఇక అమ‌ల‌ తల్లిదండ్రులకు కూడా ప్రేమ వివాహం కావడం విశేషం. ఆయన తండ్రి కలకత్తాకు చెందిన వ్యక్తి, నావి ఆఫీసర్. అలాగే తల్లి ఐర్లాండ్ కు చెందిన అమ్మాయి. ఇక అమల ఇటీవల సినిమాల్లో రియంట్రి ఇచ్చి.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. ఒకే ఒక జీవితం సినిమాలో తల్లి పాత్రలో మెప్పించింది.