పేగుల్ని శుభ్రపరిచి…మిమ్మల్ని దృఢంగా ఉంచే ఆహారాలు ఇవే..!

యాపిల్స్ లో ప్లాంట్ సెల్యూలోజ్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల్ని శుభ్రం చేయటంలో సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గించుకోవచ్చు. పసుపులోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు పేగుల్లోని మ్యూకస్ ను తొలగించటంలో సహాయపడతాయి.

అలాగే మలం సాఫీగా వచ్చేలా చేస్తాయి. అవిసె గింజలలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలిక మెరుగుపరిచి మలబద్దకాన్ని నివారిస్తుంది. పేగుల్ని శుభ్రపరుస్తుంది. పాలకూరలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రం చేసి జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుంది.

పేగుల్ని శుభ్రం చేయటంలో నిమ్మకాయ ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి . అలాగే శరీరాన్ని డి టాక్సీ ఫై చేయటంలో ఇది సహాయపడుతుంది. వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో యాంటీ బ్యాక్టిరి మల్ గుణాలు జీర్ణశయాన్ని శుభ్రం చేయటంలో సహాయపడతాయి. అలాగే పేగుల నుండి విష పదార్థాల్ని బయటకు పంపుతాయి.