బెంగుళూరు రేవ్ పార్టీలో నటి హేమ జల్సాలు..? సెన్సేషనల్ వీడియో వైరల్..!

ప్రజెంట్ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించిన న్యూస్ ఎంత హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే . సరదాగా స్టార్ సెలబ్రిటీస్ వీకెండ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పలువురు అవి హద్దుల్లో పెట్టుకొని ఉంటే మరికొందరు మాత్రం రేవ్ పార్టీ పేరిట డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు . బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతుంది . ఈ పార్టీలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ తో పట్టు బడడంతో పాటు కొకైన్ కూడా ఉండడం సంచలనం గా మారింది.

వీఇపీ కార్లు కూడా దర్శనం ఇవ్వడం సంచలనంగా మారింది. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి దిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది . అంతేకాదు ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యాంకర్ తో పాటు ప్రముఖ తెలుగు నటి హేమ కూడా ఉన్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వినిపించాయి .

రేవ్ పార్టీలో హేమ జల్సాలు చేస్తుంది అంటూ వార్తలు కూడా వినిపించాయి. దీనిపై హేమ స్పందించారు. “నేను రేవ్పార్టీలో లేను అంటూ తెగేసి చెప్పేసింది. ప్రస్తుతం తాను హైదరాబాదులోనే ఉన్నాను అని ఓ వీడియో విడుదల చేసింది. ఆల్రెడీ ఇక్కడే హైదరాబాద్లో ఓ ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను బెంగళూరులో రేవ్ పార్టీతో నాకు ఏ సంబంధం లేదు. నేను ఆ పార్టీలో ఉన్నాను అంటూ వస్తున్న వార్తలను నమ్మకండి నన్ను అనవసరంగా లేనిపోని ఇష్యూస్ లో లాగుతున్నారు ..నా గురించి మీడియాలో వస్తున్న వార్తల్లో ఏం మాత్రం నిజం లేదు ” అంటూ హేమ స్పష్టం చేసింది . హేమ అభిమానులు కూడా ఆమెకు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. హేమ ఆ టైప్ కాదని హోమ్లీ బ్యూటీ అని హేమ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది అని ఆమె వీడియో కి సపోర్ట్ చేస్తూ ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఆమె మంచితనాన్ని ప్రూవ్ చేస్తున్నారు..!!