వైజయంతి మూవీస్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్స్ లిస్ట్ ఇదే..?!

సినీ ఇండస్ట్రీ ము్దుకు వెళ్ళాలంటే డైరెక్టర్స్, రైటర్స్ ఎంతొ అవ‌స‌రం. అలాగే నార్మాతలు నిర్మాణ సంస్థలు కూడా మూవీ ఇండస్ట్రీలో కీలకమైన పాత్రలు పోషిస్తారు. డైరెక్టర్స్ ఎంతోమంది హీరో హీరోయిన్లను లాంచ్ చేసామని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ప్రొడక్షన్ హౌస్ లే వారి బాధ్యత వహిస్తాయి. కొత్త వారిపై నమ్మకం ఉంచి వారికి సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేస్తాయి. అలా చాలామందిని పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ లు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. వాటిలో వైజయంతి మూవీస్ కూడా ఒకటి. చలసాని అశ్వినిద్దత్ 1972లో ఈ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి.. ఈ సంస్థ ద్వారా సిల్వర్ స్క్రీన్ కు ఎంతమంది స్టార్ నటీనటులను అందించాడు. అలా వైజయంతి మూవీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. స్టార్స్‌గా దూసుకుపోతున్న‌ నటీనటులు ఎవరో ఒకసారి చూద్దాం.

Raja Kumarudu (1999) | Cast & Crew | News | Galleries | Movie Posters |  Watch Raja Kumarudu Movie Online

మహేష్ బాబు :

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబును వైజయంతి మూవీస్ బ్యానర్ రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

Watch Gangotri Movie Online for Free Anytime | Gangotri 2003 - MX Player

అల్లు అర్జున్ :

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అల్లు అరవింద్‌, అశ్విని దత్ సంయుక్తంగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ సినిమాతోనే అదితి అగర్వాల్ కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

Okato Number Kurraadu - Wikipedia

నందమూరి తారకరత్న :
నందమూరి తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వైజయంతి మూవీస్ రూపొందించాయి.

Watch Baanam Full movie Online In HD | Find where to watch it online on  Justdial

నారా రోహిత్:
వైజయంతి మూవీస్ నిర్మాణంలో వ‌చ్చిన‌ బాణంతో నారా రోహిత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

9 years for Yevade Subramanyam : r/tollywood

విజయ్ దేవరకొండ :
అడ్వెంచర్స్ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. ప్రియాంక దత్, స్వప్న దత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతోనే మాళవిక నాయర్ కూడా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇలా విజయ్ దేవరకొండ మాళవిక నాయర్ ను వైజయంతి సంస్థ పరిచయం చేసింది.

Mahanati new still: Keerthy Suresh and Dulquer Salmaan recreate Savitri and  Gemini Ganesan's magic

దుల్కర్ సల్మాన్ :
యంగ్‌ హీరో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్‌కు పరిచయం చేసింది వైజయంతి మూవీస్. మహానటి సినిమాతో దుల్కర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Sita Ramam Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos  | eTimes

మృణాల్ ఠాకూర్:
బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ సీతారామం తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెర‌కెక్కింది. దీంతో మృణాల్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత వైజయంతి మూవీస్ సొంతం చేసుకుంది.