“ఎన్ని జన్మలు ఎత్తిన ఈ టాలీవుడ్ ఇండస్ట్రీ అంతే..ఇక మారదు”.. కాజల్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలా ఓల్డ్ గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారో మనం చూస్తున్నాము.. ఇక అబద్ధాలు చెప్తే ఇండస్ట్రీలో నెట్టుకురాలేము అన్న ఆలోచనలకు వచ్చారో.. లేకపోతే నిజం మాట్లాడితేనే జనాలు మనల్ని లైక్ చేస్తారు అని అనుకున్నారో.. ఏదైనా కానీ ఈ మధ్యకాలంలో హీరోయిన్ అందరూ కూడా ఇండస్ట్రీపై ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి .

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా సత్యభామ . ఈ సినిమా మే 31 తేదీ రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది ఈ బ్యూటీ . కాగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తెలుగు ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది .

ఆమె మాట్లాడుతూ ..”పెళ్లి తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. పెళ్లి అయి బిడ్డలు పుట్టిన సరే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ హీరోయిన్ హీరోయిన్ గానే నటిస్తుంది . కానీ టాలీవుడ్ లో మాత్రం పెళ్లైపోయిన తర్వాత హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వరు ..ఎందుకో తెలియదు …. ఫ్యూచర్లో అయినా ఆ విషయంపై ఆలోచించి మార్పు తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ” అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది . నిజానికి కాజల్ అగర్వాల్ చెప్పింది నిజమే .. కరీనాకపూర్ పెళ్లయి పిల్లలకు జన్మనిచ్చిన ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్గా చేస్తుంది. అదే మన ఇండస్ట్రీకి వచ్చేసరికి పెళ్లి తర్వాత ఒక్క హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది . తెలుగు ఇండస్ట్రీలో నిజంగానే అలాంటి ఓ వ్యత్యాసం చూపిస్తున్నారు అన్నది మాత్రం వాస్తవం అంటున్నారు అభిమానులు..!!