ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండి ఉంటే..ఈ హీరోయిన్ ఇప్పుడు రష్మికనే మించిపోయేదా..!?

ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వచ్చాక ఆచితూచి అడుగులు వేయాలి. ఎలా అంటే వన్స్ మనం ఇండస్ట్రీలోకి వచ్చి ఒక స్టార్ స్టేటస్ అందుకున్నాక కచ్చితంగా మన ఒళ్ళు కంట్రోల్ లో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి .. బహుశా మనపై సోషల్ మీడియాలో ఏదైనా వార్తలు వైరల్ అవుతున్న సరే వాటిని పకడ్బందీగా తిప్పి కొట్టాలి . అది నేను కాదు అంటూ ప్రూవ్ చేసుకోగలగాలి ..అప్పుడే ఆ హీరోయిన్ కి ఇండస్ట్రీలో లైఫ్ ఉంటుంది నాకెందుకులే అనుకుంటే మాత్రం కచ్చితంగా బొక్క బోర్ల పడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సిచువేషన్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ ఛార్మి.

ఛార్మి అంటే అభిమానులకి ఎంత ఇష్టం అనే దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చార్మి స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోలందరూ కూడా ఆమె గురించి పాజిటివ్ గానే చెబుతూ వస్తారు. చార్మి ఒక హై ఎనర్జీ కలిగిన హీరోయిన్ అని.. ఆమె అద్దిరిపోయే రేంజ్ లో నటిస్తుంది అని చాలామంది స్టార్స్ ఆమె గురించి పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. అయితే తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు కారణంగానే చార్మి లైఫ్ ఇప్పుడు ఇలా మారిపోయింది అంటున్నారు జనాలు . కెరియర్ పిక్స్ లో ఉండగానే కొన్ని ఐటమ్ సాంగ్స్ నటించడం చార్మి చేసిన బిగ్ మిస్టేక్ .

అంతేకాదు ఈ బ్యూటీ పెళ్లయిన డైరెక్టర్స్ ను కూడా వలలో వేసుకుంది అంటూ వార్తలు రావడం స్పందించకపోవడం ఆమె కెరియర్ని కష్టాల్లోకి నెట్టేసింది . అంతేనా మంచి మంచి గా హీరోయిన్ రోల్స్ లో దూసుకుపోతున్న ఛార్మి డిఫరెంట్ కంటెంట్ అంటూ కొన్ని సినిమాల్లో నటించడం ఆమెకు బిగ్ నెగిటివ్ గా మారింది . మరీ ముఖ్యంగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతిలక్ష్మి సినిమాలో వేశ్య పాత్రలో నటించడం ఆమెకు బిగ్ మైనస్ గా మారింది . అఫ్కోర్స్ ఆ పాత్రలో జనాలు లైక్ చేశారు.. కానీ అది ఒక హీరోయిన్గా లైక్ చేయకపోవడంతోనే ఆమె ఈ రేంజ్ లో ఇప్పుడు తన కెరీర్ ని డౌన్ ఫాల్ చేస్తుంది అంటున్నారు .ఒకవేళ ఛార్మి బాగా మంచి నిర్ణయాలు తీసుకొని ఉంటే ఇప్పుడు రష్మిక మందనాన్ని మించిపోయే రేంజ్ లో ఇండస్ట్రీని ఏలేసేది అంటున్నారు జనాలు..!!