గత కొంతకాలంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అంతే కాదు రాజమౌళి సినిమా విషయంలో వీళ్లిద్దరి మధ్య ఇష్యూలు స్టార్ట్ అయినట్లు కూడా ప్రచారం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ను తక్కువ చేశారు అని రాంచరణ్ క్యారెక్టర్ ను హైలెట్ చేశారు అని అందుకే రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు ఓ రేంజ్ లో దున్నేస్తున్నాడు అని చాలామంది జనాలు కామెంట్స్ పెట్టారు.
మరి కొంతమంది నందమూరి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మాటలు యుద్ధం కూడా చేసుకున్నారు . అయితే పలు సందర్భాలలో రామ్ చరణ్ – తారక్ ఒకే స్టేజిపై మెరవకపోవడం కూడా దానికి పెద్ద తలనొప్పిగా మారింది . రీసెంట్గా ఆ ఇష్యూస్ పై క్లారిటీ ఇచ్చేసాడు రామ్ చరణ్. నేడు జూనియర్ ఎన్టీఆర్ బర్త డే.. ఈ సందర్భంగా “హ్యాపీయెస్ట్ బర్త డే టు మై డియరెస్ట్ తారక్” అంటూ ఒక పోస్ట్ పెట్టాడు .
దీంతో వీరిద్దరి మధ్య ఇంకా స్నేహబంధం కొనసాగుతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వీళ్ల మధ్య గొడవలు అంటూ వస్తున్నవి అంతా చెత్త వార్తలేనని క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి ఒకే ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు గ్లోబల్ స్టార్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నారు . తారక్ కి బర్త్డ డే విషెస్ చెప్పిన రామ్ చరణ్ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది . ఇకనైనా ఫ్యాన్స్ కూల్ అయితే బాగుంటుంది అంటున్నారు జనాలు. అంతేకాదు ఎవరైతే తమ ఫ్రెండ్షిప్ ని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి ఒకే ఒక్క దెబ్బతో నోర్లు మూయించి ఆన్సర్ ఇచ్చేశాడు రామ్ చరణ్.. దట్ ఈజ్ మెగా పవర్ స్టార్ అంటూ మళ్ళీ మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ని హైలెట్ చేస్తున్నారు..!!
Happiest birthday to my dearest @tarak9999 pic.twitter.com/yocPcidL08
— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2024