ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో శోభిత ధూళిపాల అదేవిధంగా నాగచైతన్య పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాలతో బాగా మింగిల్ అవుతున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టే వీళ్ళిద్దరూ కలిసి తిరిగిన ఫొటోస్ ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం. కాగా పరోక్షకంగా సమంతకు ఘాటు కౌంటర్ వేసింది శోభిత ధూళిపాల అన్న విషయం అందరికీ తెలిసిందే.
చాయ్ అనే పదం ఉపయోగిస్తూ లాజికల్ స్టేటస్ పెట్టి మరి సమంతకు గూబ గుయ్యమనే ఆన్సర్ ఇచ్చింది. అంతకుముందే సమంత తన పెళ్లి డ్రెస్ ను రీ క్రియేట్ చేసింది. కాగా రీసెంట్ గా శోభిత ధూళిపాళ్ల చైతన్యతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు అనఫీషియల్ గా కన్ఫామ్ చేసేసింది. తాజాగా కేన్స్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై దర్శనమిచ్చింది హాట్ బ్యూటీ శోభిత ధూళిపాళ. చాలా స్టైలిష్ మోడరన్ డ్రెస్ తో కుర్రాళ్ళ మతులు పోయే రేంజ్ లో దర్శనం ఇచ్చింది .
అయితే ఈ ఫొటోస్ లో అమ్మడు తన డ్రెస్ కి తగ్గట్టు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంది . అక్కడే అసలు సమస్య వచ్చి పడ్డింది. ఆ ఇయర్ రింగ్స్ లో ఛ్,డ్ అనే లెటర్స్ కలిపిన మాదిరిగా ఉన్నాయి . దీంతో చైతన్య పేరు వచ్చేటట్టు జాగ్రత్త పడి మరి ఇలా క్రియేట్ చేయించుకుంది అంటూ నెటిజెన్లు భావిస్తున్నారు . అందుకే ఆ లెటర్ చెవులకు పెట్టుకుంది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . కనీసం నెక్స్ట్ పోస్టులో అయినా అఫీషియల్ గా తమ ప్రేమ విషయాన్ని బయట పెడితే చూడాలి అనుకుంటున్నారు ఫ్యాన్స్ ..మరి కొందరు ప్రేమిస్తే తప్పా..? అంటూ శోభిత ధూళిపాళ్ల కి సపోర్ట్ చేస్తున్నారు..!!