ఒక స్టార్ హీరో కి సంబంధించిన సినిమా అప్డేట్ వచ్చింది అని ఆనందపడాలో.. మరొక స్టార్ హీరో సినిమా ఆలస్యం అవుతుంది అని బాధపడాలో.. తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు ఇప్పుడు జనాభా. మనకు తెలిసిందే.. నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ఆయనతో తెరకెక్కించే సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. నిజానికి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అనేది ఎప్పుడో అనౌన్స్ చేశారు . అయితే సినిమా మాత్రం సెట్స్ పైకి తీసుకురాలేకపోయారు.
కాగా దీనిపై నందమూరి ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్నారు . ఎన్టీఆర్ బర్త్డ డే సందర్భంగా నేడు ఆగస్టు 2024వ సంవత్సరంలో ఈ సినిమా తెరపైకి తీసుకుని రాబోతున్నాము .. సెట్స్ పైకి రాబోతుంది అంటూ చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది . ఇదే పెద్ద తలనొప్పి క్రియేట్ చేసింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తే మరి సలార్ 2 పరిస్థితి ఏంటి ..? మరింత ఆలస్యం కాబోతుందా..? అనే విధంగా డౌట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు.
అంతేకాదు సలార్ 2 సినిమా లేట్ అయితే అలాంటి హిట్ ప్రభాస్ ఖాతాలో ఎప్పుడు పడాలి ..కల్ కి సినిమా తర్వాత అంత పెద్ద హిట్ ప్రభాస్ ఖాతాలో పడాలి అంటే కచ్చితంగా అది స్పిరిట్ సినిమానే.. స్పిరిట్ సినిమా తెరకెక్కించిన తర్వాత సలార్ తెరకెక్కిస్తారా..? ఏమో ఫుల్ కన్ఫ్యూషన్లో ఉన్నారు రెబల్ ఫ్యాన్స్ . అంతేకాదు ఎన్టీఆర్ బర్త డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ న్యూస్ రెబల్ ఫాన్స్ కు వెరీ వెరీ హెడ్ ఏక్ గా మారిపోయింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ప్రశాంత్ నీల్ ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తే మరొక స్టార్ హీరో ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేసాడు . ఏమో ఈ అప్డేట్ ఎన్ని గొడవలకు దారితీస్తుందో అంటున్నారు సినీ విశ్లేషకులు..!?