పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ బ్యూటీ యామి గౌతమ్.. ఎంత మంచి పేరు పెట్టారో..?!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ యామి గౌతమ్ కు టాలీవుడ్ ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తెలుగులోను హీరోయిన్‌గా ప‌లు సినిమాల‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2021 జూన్ 4న హిమాచల్ ప్రదేశ్ లో డైరెక్టర్ ఆదిత్య ధ‌ర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది యామి గౌతమ్. తాజాగా ఈ అమ్మడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్న ఈ జంట.. శ్రీకృష్ణుడి ఫోటోను షేర్ చేస్తే తాము మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు వివరించారు. మే 10 (అక్షయ తృతీయ) రోజున తన కుమారుడి జన్మించాడని అతనికి వేద్ విత్ అనే పేరు పెట్టినట్లు వారు మే 20న వెల్లడించారు.

Yami Gautam, Aditya Dhar confirm pregnancy at Article 370 trailer launch:  'There is a baby on the way' | Bollywood News - The Indian Express

అయితే ప్రస్తుతం వేద్ విత్ అనే పదానికి అర్థం తెలుసుకొని అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు. నిజంగా మీ బాబుకు చాలా మంచి పేరు పెట్టారు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వేద్ విత్ అంటే వేదాలు తెలిసినవాడని అర్థం. ఇది ప‌దం విష్ణు, శివుడు మరియు రాముడికి కూడా మరో పేరు అని తెలుస్తోంది. వేదం అనేది సంస్కృతం. దీని అర్థం హిందూ మతంలో జ్ఞానం, పవిత్ర గ్రంథం. విద్ అంటే జ్ఞానం ఉన్నవాడు అని అర్థం వస్తుంది. ప్రస్తుతం వేద్ విత్ అనే పదానికి అర్థం తెలుసుకున్న యామి గౌతమ్ ఫ్యాన్స్ అంతా ఆమెను ప్రశంసిస్తున్నారు.

ఇక చివరిగా యామి గౌతమ్ ఆర్టికల్ 370, ఓ మై గాడ్, తూ మైన్ హోం లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం మగ బిడ్డకు జన్మనిచ్చిన ఈ అమ్మ‌డు కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుంది. అయితే ప్రస్తుతం యామి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలియడంతో.. బాలీవుడ్ ప్రముఖులు హృతిక్ రోషన్, రణ్‌బీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురాన్ ఇలా ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఈమెకు విషెస్ తెలియజేశారు. మృణాల్ ఠాగూర్, నేహా థూపియ తదితరులు లవ్ ఇమేజెస్ తో ఆమెను విష్ చేశారు.