పుష్ప 2 విషయంలో సుకుమార్ ని ఇబ్బంది పెడుతున్న ఆ మూడు సమస్యలు ఇవే..భలే ఇరుక్కునేశాడే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. గతంలో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప1 సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా రాబోతుంది . పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ అయ్యి .. ఎలా సూపర్ డూపర్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా బన్నీ కెరియర్ ఓ రేంజ్ లో మార్చేసింది. ఇప్పుడు అందరి కళ్ళు పుష్ప2 పైనే ఉన్నాయి. పుష్ప2 విషయంలో సుకుమార్ బన్నీ ఏ నిర్ణయం తీసుకున్న సరే సోషల్ మీడియాలో అది వైరల్ గా మారిపోతుంది .

తాజాగా పుష్ప2 నుంచి రిలీజ్ అయిన పాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కాగా పుష్ప2 ముందు మూడు సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి . అందులో మొదటిది అనుకున్న టైం కన్నా ఎక్కువ కాలం షూట్ జరగడం .. సాధారణంగా ఏ స్టార్ సెలబ్రిటీ కైనా కాల్ షీట్స్ ఇంపార్టెంట్ . ఒక టైం కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసి మరొకసారి మరొక సెలబ్రిటీ అదే టయానికి కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక పోతే చాలా గజిబిజి గందరగోళం అవుతుంది.

అలా సుకుమార్ ఈ సినిమా విషయంలో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారట. అంతేకాదు రెండవది ఈ సినిమాలో నటిస్తున్న ఫహెద్ ఫసిల్..ఈ సినిమా కీలక పాత్ర పోషిస్తూ ఉండడం గమనార్హం. ఎక్కువ డేట్స్ కూడా అవసరం . అయితే మొదటి అనుకొన్న దాని మీద 15 రోజులు ఎక్స్ట్రా కాల్ షీట్స్ అవసరం ఉండడంతో ఆయన వేరే సినిమాలో బిజీగా ఉండడంతో పెద్ద తలనొప్పులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది .అంతేకాదు ఈ సినిమా కు ఐటెం సాంగ్ కూడా పెద్ద సమస్యగా మారినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఐటమ్ గర్ల్ గా ఎవర్ని తీసుకోవాలని విషయంలో ఇంకా క్లారిటీ రానట్లు ప్రచారం జరుగుతుంది . మొదట దిశా పటానీ అంటూ ప్రచారం జరిగిన అది అస్సలకి నిజం కాదు అంటూ తేల్చి పడేసింది పుష్ప 2 టీం. అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో జాన్వి కపూర్ తో ఆయన ఐటెం సాంగ్ చేయించాలి అనుకుంటున్నారట . మరి బోనికపూర్ ఒప్పుకుంటాడా ..? లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది..!?