ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్.. దుమ్ము రేపిన జపాన్ ఫ్యాన్స్.. ఇది తారక్ రేంజ్..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న తారక్ ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక నేడు మ్యాన్ ఆఫ్ మాసేస్ తార‌క్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అయిన పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ లెవెల్ లో జరుపుకుంటున్నారు అభిమానులు. ఆర్‌ఆర్ఆర్ పాన్ ఇండియాలో హిట్ కావడంతో పాన్ ఇండియా కంటే ఎక్కువగా ఇతర దేశాల్లోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాడు.

Young Tiger NTR B-Day: Ram Charan, Allu Arjun, Mahesh Babu and others drown him in lovely wishes - Telugu News - IndiaGlitz.com

ముఖ్యంగా జపాన్‌లో తారక్‌కు భారీ క్రేజ్ ఏర్పడింది. జపాన్ ఫ్యాన్స్ తారక్ పాటలకు డ్యాన్స్ వేయడం.. ఆయన డైలాగ్స్ కు వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇక నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తారక్‌ ఫ్యాన్స్ తో పాటు.. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ తెలియజేశారు. ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లాంటి ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్ తో పాటు నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా ఆయనకు విషెస్ తెలియజేయగా.. నెటింట వీరు విష్ చేసిన ట్విట్స్ తెగ వైరల్ గా మారాయి.

ఇక సెలబ్రిటీస్ విషెస్ సంగతి అలా ఉంటే.. సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. కోట్లాదిమంది తారక్ విషెస్ తెలియజేస్తున్నారు. కాగా ప్ర‌స్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోలో జపాన్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన కటౌట్ ను ఏర్పాటు చేసి కటౌట్ మెడలో మాల వేసి.. పూలు చల్లుతూ మాస్ స్టెప్స్ తో దుమ్మురేపారు. ఎన్టీఆర్ బృందావనం మూవీ చిన్నదో వైపు.. పెద్దదోవైపు.. సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ ఎన్టీఆర్‌కు బర్త్డే విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ఎన్టీఆర్ అభిమానులంతా దీనిని తెగ వైరల్ చేస్తున్నారు. ఇది తారక్ రేంజ్ అంటూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.