ఒక్క మాటతో మెగా డాటర్ అని ప్రూవ్ చేసిందిగా.. శ్రీజ దెబ్బ అదుర్స్..!

సోషల్ మీడియాలో సమంత తర్వాత హ్యూజ్ ట్రోలింగ్కి గురైన పేరు ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ అనే చెప్పాలి . ఇండస్ట్రీతో ఆమెకు అస్సలు సంబంధం లేదు . తన నాన్న మెగాస్టార్ కానీ ఆమె ఇండస్ట్రీపై ఎప్పుడు కూడా డిపెండ్ అయ్యింది లేదు ..తెరపై కనిపించింది లేదు .. సోషల్ మీడియాలో మాత్రమే ఉంటుంది . కానీ ఎందుకో శ్రీజ అంటే కొందరు జనాలు గుర్రుగా ఉంటారు . బహుశా మెగా ఫ్యామిలీ పరువు తీయడానికి శ్రీజ ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైంది అన్న భావన మెగా అభిమానుల్లో కూడా ఉండొచ్చు .

కాగా శ్రీజ లైఫ్ మొత్తం గజిబిజి గందరగోళంగా స్టార్ట్ అయింది . అలాగే ముగిసింది . మొదట ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయి కుటుంబం పైన కేసు పెట్టింది . ఆ తర్వాత అతగాడికి విడాకులు ఇచ్చేసి కుటుంబం పైన డిపెండ్ అయ్యింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ని ఇచ్చి పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు . అమ్మడి టైం బ్య్డో లేకపోతే ..జాతకాలు కలవలేదో.. అక్కడ కూడా విడాకులు వరకు వెళ్లింది. ఈ జంట విడాకులు కూడా తీసేసుకున్నారు . కానీ అఫీషియల్ గా ప్రకటించలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అప్పటినుంచి సోషల్ మీడియా వేదికగా శ్రీజ అదేవిధంగా కళ్యాణ్ దేవ్ పరోక్షకంగా ఘాటుగాటుగా కౌంటర్స్ పెడుతూనే ఉంటారు. రీసెంట్గా శ్రీజ షేర్ చేసిన పోస్ట్ అభిమానులకు ఆమెలోని మొండితనాన్ని పరిచయం చేసినట్లయింది. తన ఇన్స్టా స్టోరీలో అందరి ప్రశ్నలకు గట్టిగా సమాధానం ఇచ్చేసింది శ్రీజ. ” ఎవరైనా తమను తాము ఏ స్థాయిలో ఊహించుకుంటారు .. అదే స్థాయిలో చూస్తారు .. అది నిజం ..అదే స్థాయి వాళ్లను కలుసుకుంటూ ఉంటారు .. ఇది సత్యం ఎన్నో ప్రశ్నలకు ఇదొక్కటే సమాధానం అనుకుంటున్నాను” అంటూ దిమ్మతిరిగే రేంజ్ లో కళ్యాణ్ దేవ్ ని టార్గెట్ చేస్తూ పరోక్షకంగా ఘాటుగా ఇచ్చిపడేసింది . దీంతో సోషల్ మీడియాలో మెగా డాటర్ శ్రీజ పేరు మారుమ్రోగిపోతుంది . విడాకుల గురించి ప్రశ్నించే వాళ్ళకి ఈ విధంగా ఆన్సర్ ఇచ్చింది అంటున్నారు మెగా అభిమానులు..!!