లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందా..? ఆ పోస్ట్ కి అర్ధం అదేనా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . హీరోయిన్ లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందా..? అనే క్వశ్చన్స్ మెగా అభిమానులు ఎక్కువగా వేస్తున్నారు . దానికి కారణం రీసెంట్గా హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ ఫోటోని షేర్ చేయడమే . లావణ్య త్రిపాఠి మెగా కోడలు అయిన తర్వాత మెగా ఫ్యాన్స్ ఆమెపై ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఒక కన్ను ఎప్పుడు మెగా కోడలిపై వేసే ఉంటున్నారు .

ఆమె ఎక్కడికి వెళుతుంది ..? ఎలాంటి ఫోటోషూట్ చేస్తుంది ..? ఆమె లైఫ్ లో ఏం జరుగుతుంది..? అనే విషయాలకు సంబంధించి ఎక్కువగా ఆరాతీస్తున్నారు. తాజాగా లావణ్య త్రిపాఠి తన ఫొటోస్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కొన్ని ఫోటో షేర్ చేసింది . ఆ ఫోటోలో ఒక బాబుతో కనిపించడం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది . తాజాగా లావణ్య త్రిపాఠి ఇంస్టాగ్రామ్ లో తన అన్నయ్య కొడుకుని ఎత్తుకొని ఉన్న పిక్ షేర్ చేస్తూ..” నువ్వు నేను ఒక్కే రోజు పుట్టాము .. మన ఇద్దరి పుట్టినరోజులు తేదీలు సేమ్.. కానీ సంవత్సరమే వేరు” అంటూ రాసుకొచ్చింది. అయితే ఆ బాబు ఫేస్ ని కనిపించకుండా చాలా జాగ్రత్త పడింది లావణ్య త్రిపాఠి.

అయితే ఈ పోస్ట్ చూసిన చాలామంది లావణ్య ఇలాంటి పోస్ట్ షేర్ చేయడం వల్ల స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏదైనా ఉందా..? కొంపతీసి లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందా..? త్వరలోనే మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నారా ..? అనే విధంగా చర్చించుకుంటున్నారు . ఆ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా ఇలాంటి హింట్ ఇచ్చిందా,,> అంటూ కూడా పలువురు జనాలు ఆమెను ఆమె పెట్టిన పోస్ట్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు . ఏమో లావణ్య త్రిపాఠి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందేమో ..? అంటూ కూడా ఫ్యాన్స్ ఓ విధంగా కామెంట్స్ చేస్తున్నారు..!