డాక్టర్స్ కాబోయి యాక్టర్స్ గా మారిన టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..?!

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా మారి దూసుకుపోతూ ఉంటారు. అయితే కొందరు నటులు కావాలనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే మరికొందరు అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్స్ గా మారుతూ ఉంటారు. అయితే వారి డ్రీమ్ రోల్ వేరే ఉంటుంది. అలా డాక్టర్స్ అవ్వాలని కలలుకని యాక్టర్ గా మారి ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నటీనటులు కూడా టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. వారు ఎవరో ఒకసారి చూద్దాం. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీతో నిండిన విల‌న్‌గా రాణించిన అల్లు రామలింగయ్య డాక్టర్ వృతికి చెందిన వాడే కావడం విశేషం. ఆయన హోమియోపతి వైద్యం చేసేవాడు.

Allu Arjun - Birthday wishes to my late grand father Padmashri Allu  Ramalingaiah garu . He is the foundation of our lives we live today . His  sheer passion , determination &

ఇక ఆయన పేరిట రాజమండ్రిలో డాక్టర్ రామలింగయ్య గవర్నమెంట్ హోమియోపతి కాలేజ్ కూడా ఉంది. ఇక ఈయన బ్యాక్గ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి ఈయన కొడుకు అల్లు అరవింద్, మనవడు బన్నీ కూడా ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు. అలాగే మెగాస్టార్ అల్లు రామలింగయ్య అల్లుడు అన్న సంగతి తెలిసిందే. అలాగే యాంగ్రీ యంగ్‌మ్యాన్ రాజశేఖర్ ఎంబిబిఎస్ పూర్తి చేసి డాక్టర్ గా కొంతకాలం పనిచేసిన తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సినిమాల్లో నటించి మెప్పించాడు.

High Time For Sreeleela To Change Her Approach! | High Time For Sreeleela  To Change Her Approach

టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి పాపులారిటీ దక్కించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి మొదటి ఎంబిబిఎస్ చదివింది. ఎప్పటికైనా డాక్టర్ గా రాణించాలని ఆమె కల. అనుకోకుండా నటన రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాగే రంగం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన అజ్మీర్ ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న భారత్ రెడ్డి కూడా డాక్టర్ చదువును పూర్తి చేశారు. ఇక భరత్ రెడ్డి ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో తన సేవలను అందిస్తూ బిజీగా ఉన్నాడు. నటుడు ప్రభాకర్ కూడా డాక్టర్ సినిమాల్లో డాక్టర్ పాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటాడు.

Aanandam Lyrical | Uma Maheswara Ugra Roopasya | Satyadev | Bijibal |  Venkatesh Maha

అలాగే ఉమామహేశ్వర ఉగ్ర‌ రూపస్య‌ సినిమాతో జ్యోతిక‌గా టాలీవుడ్ ప్రేక్షకుల‌కు పరిచయమైన రూపా కూడా తన డాక్టర్ చదువును పూర్తి చేసింది. గుంటూరు మెడికల్ కాలేజీలో చదువు పూర్తి చేసిన ఈమె అంబిషన్ కూడా డాక్టర్ గా రాణించడమేనట. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతున్న శ్రీ లీల లైఫ్ అంబిషన్ కూడా డాక్టర్ కావడమే. సినిమాలతో బిజీగా ఉన్న శ్రీ‌లీలా ఎప్పటికైనా తన డాక్టర్ చదువును పూర్తి చేసి డాక్టర్ గా రాణించాలని చూస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కీలకపాత్రలో నటిస్తూ దూసుకుపోతున్న కామాక్షి భాస్కర్ల కూడా తన డాక్టర్ చదువును పూర్తి చేసింది కొన్నాళ్ళు డాక్టర్ విధులను నిర్వర్తించిన తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది