ఆ విషయంలో గురు శిష్యులకు సమన్యాయం చేస్తున్న రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ ఆ మజాకా.. ?!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజ‌ర్‌ సినిమా షూట్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తుది దశకు రావడంతో బుచ్చిబాబు సనా సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాల్లో పూర్తి చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ క్రమంలో సుకుమార్ సినిమాకు కూడా రామ్ చరణ్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. అంత‌ బిజీలో కూడా వరుస‌ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న రాంచరణ్ ఏ సినిమా ఎప్పుడు పూర్తి చేస్తాడు.. గురుశీఫుల‌ కోసం మెగా వారసుడు ఎలా ప్లాన్ చేశాడ‌నే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. అయితే గేమ్ చేంజర్ మరో వారం రోజుల్లో ముగియనుంది. దీంతో తర్వాత ఈ గురు శిష్యుల‌ ఇద్దరిపై రామ్ చరణ్ ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తోంది.

Ram Charan's next is with 'Upenna' director Buchi Babu Sana - The Hindu

గేమ్ చేంజర్‌ సినిమా సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారట. అయితే జూన్ మొదటి వారం నుంచి రామ్ చరణ్ బుచ్చిబాబు సనా ప్రాజెక్ట్‌లో అడుగుపెట్ట‌నున్నార‌ని తెలుస్తుంది. అలాగే సుకుమార్ కాంబోలో చరణ్ సినిమాను కూడా 2025 లోనే రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. పైగా ఈ రెండిటిని నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్ వారే. అయితే రెండు సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయడం అనేది అంత సులువు కాదు. ఎందుకంటే గేమ్‌ చేంజర్‌ షూటింగ్ పూర్తయినా.. దాని ప్రమోషన్స్ కు చ‌ర‌ణ్‌ టైం ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఎంత వేగంగా బుచ్చిబాబు ప్రాజెక్టును పూర్తి చేయాలని చూసిన.. కనీసం ఏడాది పడుతుంది. అయితే సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Ram Charan confirms RC17 with Pushpa director Sukumar, shares first look  poster on Holi. See photo - Hindustan Times

సుకుమార్ ఈ సినిమా పూర్తయి హడావిడి నుంచి బయటకు వచ్చేలోపు.. బుచ్చిబాబుతో సినిమాను పూర్తి చేసేయాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. ఆల్రెడీ సినిమా ఫ్రీ ప్రొడక్షన్లు ముగిసాయని.. ఆరు నెలల్లో ఆర్సి 16 షూట్ పూర్తిచేసేలా బుచ్చిబాబు ప్లాన్ చేశారని తెలుస్తుంది. అలా సినిమా పూర్తి అయితే డిసెంబర్ నుంచే ఆర్సి 17 కూడా సెట్స్‌ పైకి వచ్చేస్తుంది. మొత్తానికి 2025 పూర్తయ్యేలోపు రామ్ చరణ్ నుంచి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయి. కానీ ఇది వర్కౌట్ అవుతుందో లేదో మాత్రం వేచి చూడాల్సిందే. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ ప్లానింగ్ వైరల్ అవ్వడంతో గ్లోబల్ స్టారా మజాకా అంటూ.. చెర్రీ ప్లాన్ అట్లుంటది మరి అంటూ కామెంట్ చేస్తున్నారు ఫాన్స్.