ఆ విషయంలో మహేశ్ ను హర్ట్ చేసిన గౌతమ్.. సితార పాప ది బెస్ట్ అంతే..!

సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు. అయితే ఆ తర్వాత ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు కూడా అదే రూట్లో ముందుకు వెళ్ళాడు. కాగా ఇప్పుడు ఆ బాధ్యతలు మొత్తం గౌతమ్ పై పడ్డాయి. అయితే గౌతమ్ బాబు అంత యాక్టీవ్ కాదు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

మరి ముఖ్యంగా మహేష్ బాబు – కృష్ణ ఎంత సరదాగా చిల్ అవుట్ అవుతూ ఆహ్లాదకరంగా ఆనందకరంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తారో..దానికి టోటల్ ఆపోజిట్ గౌతమ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సొంత ఫ్యాన్స్ కూడా ఇదే విధంగా కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఆ విషయంలో మహేష్ పరువును నిలబెట్టేది సితార ఘట్టమనేని అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే సితార ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కానీ..

టాప్ మోస్ట్ సెలబ్రెటీస్ లో ఈవెంట్స్ లో కానీ బాగా మెరుస్తుంది . అంతేకాదు చాలా ఫంక్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ చిలౌట్ అవుతూ ఉంటుంది. దీంతో కృష్ణ – మహేష్ కి ఉన్న అలవాటు గౌతమ్ కి రాలేదు అని.. ఆ కారణంగా మహేష్ చాలా హర్ట్ అవుతున్నాడు అని ఇండస్ట్రీలో ఎప్పటికైనా మహేష్ బాబు పేరు నిలబెట్టేది ఘట్టమనేని సితారనే అని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. మహేష్ బాబు నమ్రతలకు కూడా పలుసార్లు సితార ఘట్టమనేని టాలీవుడ్ ఎంట్రీని పరోక్షంగా కన్ఫామ్ చేశారు..!!