“అందుకే ఆ రోజు అలా చేశా”.. ఒక్క ఆన్సర్ తో అందరి నోర్లు మూయించిన తాప్సీ..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయం కూడా రాద్ధాంతం చేయడం గుచ్చి గుచ్చి ట్రోల్ చేయడం మనం ఎక్కువగా చూస్తున్నాం. అదే ఒక స్టార్ హీరోయిన్ కి సెలబ్రిటీ సంబంధించిన విషయం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు . పదే పదే అదే విషయాన్ని ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు. తాజాగా హీరోయిన్ తాప్సికి సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరిగిందో మనం చూసాం. మరీ ముఖ్యంగా.. తాప్సి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారింది . అంతేకాదు పెళ్లి రోజు తాప్సీ లెహంగా ఎందుకు వేసుకోలేదు అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ట్రోల్ చేశారు . వీటికి తాజాగా క్లారిటీ ఇచ్చింది అందాలు ముద్దుగుమ్మ తాప్సి .

ఆమె మాట్లాడుతూ..” నేను సిక్ గురుద్వార పెళ్లిలు చూసి పెరిగాను ..నాది వింటేజ్ ఐడియా.. రెడ్ కలర్ సెల్వార్ కమీజ్లో ..దుప్పట్టా.. కినారి బోర్డర్ తో పెళ్లి చేసుకోవాలి అనేది నా కోరిక ..ఎప్పటినుంచో ఇది నా క్లాసికల్ ఐడియా ..అందుకే పెళ్లికూతురు గెటప్ లో నేను ఆ డ్రెస్ వేసుకున్నాను . లెహంగాలో పెళ్లి చేసుకుంటే అది నాకు రియల్ వెడ్డింగ్ ఫీలింగ్ కలిగించదు. నాకు నచ్చిన ప్రకారం పంజాబీ డ్రెస్ లో పెళ్లి చేసుకున్నాను .. దానిని నా ఫ్రెండ్ డిజైన్ చేశారు ..ఇందులో పెద్దగా రాద్ధాంతం చేయాల్సిన విషయం ఏమీ లేదు” అంటూ సింపుల్గా కొట్టి పడేసింది . ప్రెసెంట్ తాప్సి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హీరోయిన్ తాప్సీ తన బాయ్ ఫ్రెండ్ మాథ్యూస్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఆ పెళ్లికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయకుండానే పెళ్లి చేసుకోవడం అభిమానులను షాకింగ్ కి గురి చేసింది . మొత్తానికి పెళ్లి తర్వాత తాప్సీ ఎందుకు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అనే విషయాన్ని బయట పెట్టింది. దీంతో ఒక్క ఆన్సర్ తో అందరి నోర్లు మూయించింది తాప్సీ!!