‘ ఫ్యామిలీ స్టార్ ‘ తర్వాత ఎవరు గెస్ చేయాలని ఆ హీరోని లైన్లో పెట్టిన పరుశురాం.. ?!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాగూర్ జంటగా నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. పరశురాం డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే రిలీజ్‌కు ముందు భారీ హైప్‌ నెలకొన్న ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఆ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమాకు మిక్స్డ్ టాక్‌ వచ్చింది. అయితే ఈ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డైరెక్టర్ పై దారుణంగా ట్రోల్స్ మొదలుపెట్టారు. అయితే థియేటర్లలో అంతంతమాత్రంగానే ఆడిన ఈ సినిమా.. ఓటీటీలో మాత్రం భారీ క్రేజ్తో దూసుకుపోతుంది. రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది.

Parasuram Unhappy With Vijay Deverakonda Family Star | cinejosh.com

ఇక ఫ్యామిలీ స్టార్ రిలీజ్ టైం లో సినిమా మీద కొందరు నెగటివ్ కామెంట్స్ ప్రచారం చేయడంతో సినిమా నిజంగానే బాగుండ‌దనే ఉద్దేశంతో చాలామంది ధియేటర్లో సినిమా చూడడానికి ఇష్టపడలేదట. అయితే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను నిజంగానే ఎంజాయ్ చేస్తున్నాం అంటూ పలువురు ట్విట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో విజయ్‌తో పాటు డైరెక్టర్ ట్రాక్ కూడా పూర్తిగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ తర్వాత సినిమాలపై గట్టి ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ పరుశురాం ఎవరు గెస్ కూడా చేయలేని హీరోని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు తెలుగు స్టార్ రామ్ పోతినేని.

The Warriorr' actor Ram Pothineni likely to get married to his school mate  later this year | Telugu Movie News - Times of India

రామ్‌ను హీరోగా పెట్టి సినిమా తీసేందుకు ఒక కథను కూడా రెడీ చేసినట్లు సమాచారం. ఆ స్టోరీని ఆల్రెడీ రామ్‌కు వినిపించారని.. ప్రస్తుతం ఫైనల్ చేసేందుకు రామ్‌ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో తో సినిమా తీసిన డైరెక్టర్.. ఒకసారిగా రామ్‌ పోతినేని లాంటి హీరోను సెలెక్ట్ చేసుకోవడంతో ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ఈ సినిమాలో రామ్ లవర్ బాయ్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ కొత్త సినిమా అనౌన్స్మెంట్ రానుందట. ఇక రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పాన్‌ ఇండియాలో రిలీజ్ కానుంది.