ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ” బాహుబలి ” వస్తుందంటూ క్రేజీ పోస్ట్ షేర్ చేసిన జక్కన్న..?!

బాహుబలి సిరీస్‌లతో తెలుగు సినిమా ఖ్యాతి ఏ రేంజ్ లో ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులను సృష్టించాయి. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాదు.. హాలీవుడ్‌లో సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిశాయి. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు తలెత్తుకుని చూసేలా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ రెండు సినిమాల తరువాత తెలుగులో తెర‌కెక్కిన అన్ని సినిమాలకు సౌత్ నార్త్ లోను మంచి రెస్పాన్స్ వచ్చింది. సినీ ఇండస్ట్రీలోనే రూ.1000 కోట్ల మార్కును సాధించిన మొదటి సినిమాగా బాహుబలి నిలిచిపోయింది.

Baahubali: Crown Of Blood | SS Rajamouli Announces New Animated Web Series, Trailer To Be Out Soon

డైరెక్టర్ రాజమౌళి మేకింగ్ హాలీవుడ్ మేకర్స్ దృష్టిని కూడా ఆకట్టుకుంది. ఇక ఇందులో ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రల్లో మెప్పించిన సంగతి తెలిసిందే. వీరి ముగ్గురిని సినిమాలో ఇంటర్డ్యూస్ చేసిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. వీరి నటనపై విమర్శకుల ప్రశంసలు కురిపాయి. ఇప్పటికీ బాహుబలి సిరీస్ లు భారతీయ సినీ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. అలాగే తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆరెంజ్ మూవీ మరొకటి రాలేదనడంలో సందేహం లేదు. అయితే బాహుబలి మరోసారి వస్తుందంటూ జక్కన్న తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో బాహుబలి మళ్ళీ రావడం అంటే రీరిలీజ్‌ అని అర్థం కాదు.

Baahubali Crown Of Blood Release Date | Baahubali Crown Of Blood Trailer | Baahubali Crown Of Blood Cast | Baahubali Crown Of Blood Story | Baahubali Crown Of Blood Teaser| Baahubali Crown

ఈసారి బాహుబలి యానిమేషన్ తెరపైకి రానుంది. బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ ను తీసుకువస్తున్నారు మేకర్స్. ఈ సిరీస్ తెరకెక్కనున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. త్వరలోనే ట్రైలర్ రానుందని అనౌన్స్ చేశాడు. అతని పేరును మాహిష్మతి ప్రజలు జపిస్తుంటే.. తిరిగిరాకుండా ప్రపంచంలో అతడిని ఏ శక్తి అడ్డుకోలేదు అంటూ యానిమేటెడ్ సిరీస్ బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ త్వరలో రానుందని పేర్కొన్నాడు. అయితే ఈ యానిమేటెడ్ సిరీస్ గురించి ఇతర వివరాలపై క్లారిటీ లేదు. ట్రైలర్ రిలీజ్ చేసిన తరువాత వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. థియేటర్లలో రిలీజ్ చేస్తారా లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ అని ఉందా అనే వివరాలేవి తెలియ‌లేదు. ఇక ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కొత్త ప్రాజెక్ట్ ప్రిప్రొడక్షన్ పనులలో బిజీగా గడుపుతున్నాడు.