ఒక్క సినిమాతో సౌత్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు స్టార్ సెలబ్రిటీస్ చిన్ననాటి ఫొటోస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. త్రో బ్యాక్ థీంతో ఎవరైనా స్టార్ హీరో, హీరోయిన్ల ఫోటోలు బయటకు వస్తే తమ అభిమానులు అదే రేంజ్ లో ఆ ఫొటోస్‌ను హైలెట్ చేస్తూ వైరల్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అదే విధంగా ఈ స్టార్ బ్యూటీ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. కేవలం ఒకే ఒక్క‌ సినిమాతో సౌత్ ఇండస్ట్రీని ఊపు ఊపింది ఈ చిన్నది. ఆమె మరెవరో కాదు మలయాళ బ్యూటీ మమత బైజు.

Mamitha Baiju : r/actressfab

ప్రేమలు సినిమాతో మొత్తం సౌత్ ఇండస్ట్రీ అభిమానులను తనవైపు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ.. చిన్ననాటి ఫొటోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. చిన్ననాటి ఫోటోలో ఆమెతోపాటు తన సోదరుని కూడా చూడొచ్చు. ఇక కేరళలోని కొట్టాయం జిల్లా కిడంకూరులో మమితా.. డాక్టర్ బైజు కృష్ణన్, మినీ బైజు దంపతులకు పుట్టింది. ఆమె సోదరుడు పేరు మిథున్ బైజు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న మమితా.. తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ శరణ్య లాంటి సినిమాలతో అక్కడ ఇండస్ట్రీలో హిట్ కొట్టింది. ఇప్పుడు ప్రేమలు సినిమా సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కావడంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Premalu (2024) movie posters

దీంతో ఈమెకు మరిన్ని క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. ఇప్పటికే మలయాళంలో పలు సినిమాల్లో నటించిన మమితా తమిళ్లో జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన రెబల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత రామ కుమార్, విష్ణు విశాల్‌ కలయికలో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. తెలుగులోను ఓ యంగ్ హీరో సినిమాలో మమితా నటిస్తుందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా రానున్న సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా ఫిక్స్ అయిందట. త్వరలోనే సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని టాక్.