వాట్.. ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా వెనుక వాళ్ళు ఉండాల్సిందేనా.. షాకింగ్ సీక్రెట్ రివిల్ చేసిన చిట్టి..?!

హైదరాబాద్ స్టార్ బ్యూటీ ఫ‌రీయా అబ్దుల్లా తెలుగులో జాతి రత్నాలు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాల్లో చిట్టి రోల్ ప్రేక్షకులను మెప్పించింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు తర్వాత కూడా పలు అవకాశాలు క్యూ కట్టాయి. కానీ ఆ సినిమాలు ఏవి ఆమెకు వర్కౌట్ కాలేదు. ప్రస్తుతానికి అల్లరి నరేష్ తో ఆ ఒకటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయింది. పెళ్లి కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. మే 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సందడి చేస్తున్న చిట్టి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

Faria Abdullah

అసలు మేటర్ ఏంటంటే.. జాతి రత్నాలు మూవీ ట్రైలర్ ప్రభాస్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ టైంలో జాతి రత్నాలు టీమ్ అంతా ప్రభాస్‌ను కలిశారట. అప్పుడు ప్రభాస్ ఎలాంటి ఫుడ్ పెట్టారా.. అనే ప్రశ్న ఇంటర్వ్యూలో ఎదురు కాగా.. దానికి ఆమె ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. తనకు అప్పుడు ఏం పెట్టారో గుర్తులేదు. కానీ.. ప్రభాస్ అంటేనే ఆతిథ్యానికి మారుపేరు అంటూ చెప్పుకొచ్చిన ఈ అమ్మడు ప్రభాస్‌తో ఎప్పుడు ఒక చెఫ్ టీం ఉండాల్సిందేనని.. ఒక కుక్, ఒక అసిస్టెంట్ కుక్ ఎప్పుడు ఆయన వెంటే ఉంటారని చెప్పుకొచ్చింది.

Faria Abdullah says' Kids without Marriage' adds Aa Okkati Adakku - Telugu  News - IndiaGlitz.com

ఆయన ఎక్క‌డ‌కు వెళ్ళినా ఏం అడిగితే అది వండి పెట్టడానికి వారు సిద్ధంగా ఉంటారట. ఇక ప్రభాస్ ఆమెను చూసిన వెంటనే హిల్స్ లేకుండానే ఇంత ఎత్తుగా ఉంది ఏంటి అన్నారని.. ఆ తర్వాత నా బ్యాక్ గ్రౌండ్ గురించి నేను చేసే సినిమాల గురించి అడిగి తెలుసుకున్నారు అంటూ వివరించింది. ప్రభాస్‌కు ఉన్న స్టార్‌డంకు ఆయన ఏమాత్రం గర్వం చూపించడని.. ఆయన ఎప్పుడూ డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగే అనిపిస్తాడంటూ చెప్పుకొచ్చింది ఫరియా. ప్రస్తుతం ఈ చిట్టి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.