ఎన్నికల సమరం..త్రిముఖ పోరు..!

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసినే. ఈ క్రమంలో ఈ సారి అధికారం దక్కించుకోవడం కోసం బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిలు హోరాహోయిగా తలపడనున్నాయి. అయితే ప్రధాన పోరు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే నడుస్తుంది. ఒక 20-30 స్థానాల్లో బి‌జే‌పి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

అయితే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో మూడు పార్టీలు ప్రజా క్షేత్రంలోకి దిగాయి. ఓ వైపు అధికార బి‌ఆర్‌ఎస్ మూడోసారి అధికారం దక్కించుకోవడం కోసం ఓ వైపు సరికొత్త పథకాలు అమలు చేస్తూనే..మరోవైపు అభివృద్ధి పనులని ప్రారంభిస్తుంది. ఇటు కే‌టి‌ఆర్, హరీష్ రావు, కవిత…ఈ ముగ్గురు పార్టీ గెలుపు బాధ్యతలని తీసుకున్నారు. కే‌సి‌ఆర్ వ్యూహాలు రచించి ప్రత్యర్ధులకు చెక్ పెట్టే అంశంపై దృష్టిపెట్టారు. ఎక్కువ శాతం ప్రజల్లో కే‌టి‌ఆర్, హరీష్‌లని తిప్పాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ప్రజల్లో తిరుగుతున్నారు. అటు కాంగ్రెస్ సైతం ఓ వైపు బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే..మరోవైపు అభ్యర్ధుల ఎంపిక విషయంపై ఫోకస్ పెట్టింది.

అలాగే అభ్యర్ధులుగా పోటీచేసేవారు కొంత ఫీజు కట్టి దరఖాస్తులు పెట్టుకోవాలని సూచించింది. ఇక సీట్ల విషయంలో సీనియర్ల మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా అధిష్టానం ప్రయత్నిస్తుంది. అలాగే అధిష్టానం పెద్దలు వరుసగా రాష్ట్రానికి వచ్చి భారీ సభలు నిర్వహించనున్నారు.

ఇటు బి‌జే‌పి సైతం తమ సత్తా ఏంటో చూపించాలని చూస్తుంది. ఈ క్రమంలో బి‌జే‌పి నేతలు బస్సు యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. బి‌ఆర్‌ఎస్ పార్టీ అమలు చేయని హామీలపై బి‌జే‌పి ఫోకస్ పెట్టి ప్రజల్లోకి వెళుతుంది. ఇలా మూడు పార్టీలు ప్రజల్లోకి వెళుతూ..ఎన్నికల ప్రచారం షురూ చేశాయి.