సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `బిజినెస్ మేన్` ఒకటి. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. థమన్ స్వరాలు అందించాడు. 2012 జనవరి 13న విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
అయితే దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఈ సినిమాను ఇటీవల మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా రీరిలీజ్ చేశారు. రీరిలీజ్ లోనూ బిజినెస్ మేన్ దుమ్ము లేపింది. పాత సినిమా రికార్డులన్నీ గల్లంతు చేసింది. రూ. 5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ టైమ్ లో మహేష్ బాబు ఓ ప్రయోగం చేశాడు. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ సాంగ్ పాడేందుకు ప్రయత్నించాడట. టాలీవుడ్ లోని చాలా మంది హీరోలతో థమన్ పాటలు పాడించాడు.
అలాగే బిజినెస్ మేన్ టైంలో కూడా మహేష్ బాబు చేత ఒక సాంగ్ పాడించడానికి ట్రై చేశాడట. దాదాపు రెండు గంటలు మహేష్ బాబు సాంగ్ పాడేందుకు ప్రయత్నించాడట. కానీ, అది కూదరలేదు. దాంతో మహేష్ ఇది వర్క్ అవుట్ కాదని చెప్పి సైడ్ అయ్యాడు. అయితే థమన్ మాత్రం కనీసం కొన్ని డైలాగ్స్ అన్న చెప్పండి అంటూ బలవంతం చేయడంతో.. బిజినెస్ మేన్ థీమ్ సాంగ్ ‘బాగ్ సాలే’ లో మహేష్ డైలాగ్స్ చెప్పాడు. ఎవరికీ తెలియని ఈ సీక్రెట్ ను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ స్వయంగా బయటపెట్టాడు.