విశ్వక్ పెళ్లి లేదు..ఏం లేద్.. అంతా తూచ్.. ఆహా క్రేజీ ప్లాన్ ఇదే..!!

ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయిన తన ఆటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్ కూడా ఒకరు.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.. యాక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా స్క్రిప్ట్ రైటర్ గా డైరెక్టర్ గా మంచి క్రేజీను సంపాదించుకొని మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు పొందారు విశ్వక్ సేన్.. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ హోస్ట్ గా కూడా మారబోతున్నట్లు తెలుస్తోంది..

ప్రముఖ ఆహా ఓటీటి ప్లాట్ ఫామ్ లో ఫ్యామిలీ ధమాకా అనే ఒక సరికొత్త గేమ్ షో రాబోతోంది.. ఇందుకు విశ్వక్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.. ఈ విషయాన్ని ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేస్తూ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు ఆహా సంస్థ.. ఇక చూస్తున్నారుగా ఫ్యామిలీ ధమాకా మాస్ కా దాస్ ఇలాకా ఇది మాస్ కా దాస్ ఆడించే ఫ్యామిలీ ఆట.. త్వరలోనే రాబోతోంది అంటూ ఆహా క్యాప్షన్ కూడా విడుదల చేయడం జరిగింది.

ఈ గ్లింప్స్ లో అందరికీ నమస్తే వెల్కమ్ టు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ షో ధమాకా ఇది దాస్ ఇలా తనదైన స్టైల్ లో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ షో కాన్సెప్ట్ ఏంటి ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి కంటిస్టెంట్లు ఎవరనే విషయం మాత్రం తెలుపలేదు ఈ వివరాలు త్వరలోనే ఆహ నే తెలియజేస్తుందని తెలుస్తోంది. ముందుగా విశ్వక్ పెళ్లి గురించి వార్తలు ఎక్కువగా వినిపించాయి కానీ పెళ్లి లేదు.. ఏమీ లేదు కేవలం ఆహా లో షో చేయడం కోసమే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానంటూ విశ్వక్ తెలియజేశారు.