గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్.. ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌. నాగార్జున జంట‌గా హిట్ సినిమాల్లో నటించి మంచి పాపులారిటి దక్కించుకుంది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా. 30 ఏళ్లగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె ఎవరో కాదు గిరిజా శెట్టర్. ఈ పేరు చెప్తే చాలామందికి గుర్తుకు రాకపోవచ్చు కానీ గీతాంజలి సినిమాలో కింగ్ నాగార్జున సరసన జంటగా నటించిన హీరోయిన్ అంటే ఠ‌క్కున గుర్తుకు వస్తుంది.

మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాలో ఎమోషన్స్ ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టించాయి. గీతాంజలి సినిమాలో లవ్ ట్రాక్‌లో నాగార్జున – గిరిజ నటన‌కి కోట్లాదిమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె ఎనర్జీ, ఆటిట్యూడ్‌తో అప్పట్లో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో ఆమెను చూసిన కుర్రాళ్లంతా ఇలాంటి లవర్ మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించే విధంగా మెప్పించింది.

గీతాంజలి సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని ఈమె వివాహం చేసుకొని పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. గిరిజ మొత్తంగా ఇండస్ట్రీలో ఐదు సినిమాలలో మాత్రమే నటించింది. ప్రస్తుతం గిరిజ కన్నడ మూవీలో నటిస్తుంది. ఇబ్బని తబ్బిదా ఇలెయాలి అనే సినిమాలో కీరోల్‌లో నటిస్తుంది.