ఒకప్పుడు తెలుగు సినిమాలు రీ రిలీజై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. తర్వాత తర్వాత రీరిలీజ్ సినిమాల క్రేజ్ తగ్గిపోయింది. మళ్లీ తాజాగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఇక ఇదివరకే రామ్ చరణ్ నటించిన ‘ ఆరెంజ్ ‘ సినిమా రీ రిలీజైన సంగతి తెలిసిందే. మంచి వసూళ్లు రాబట్టిన ఈ సినిమా కలెక్షన్స్ జనసేన పార్టీ ఫండ్స్ కి ఉపయోగించాలని నిర్నయించుకున్నారు.
ఇక తాజాగా మెగాస్టార్ బర్త్డే కానుకగా మెగా ఫాన్స్ కు చరణ్ మరో హిట్ సినిమా ‘ నాయక్ ‘ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కానీ ఈ అనౌన్స్మెంట్ వచ్చిన గంటకే సినిమా రీ రిలీజ్ చేయడం ఆపివేసామంటూ నిర్మాణ సంస్థ వెల్లడించింది. దీంతో సినిమాను రిలీజ్ చేయకుండా ఆపివేయడానికి గల కారణాలు ఏంటి అనే అంశంపై ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది.
వి.వి వినాయక్ డైరెక్షన్లో 2013లో రిలీజైన నాయక్ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో హిట్ టాక్ వచ్చినా కధ,కధనాల విషయంలో ఆడియోస్ నుంచి చాలా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. బహుశా ఇదే కారణం దృష్టిలో పెట్టుకొని సినిమా రిలీజ్ చేయడం ఆపినట్లు సమాచారం.