కేసీఆర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా….!

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా.., దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి. సిద్దిపేట జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. సీఎం కేసీఆర్ కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం కేసీఆర్ సెంటిమెంట్ ఆలయం. ఏ ముఖ్యమైన కార్యం తలపెట్టినా ఇక్కడి […]

పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బిత్తిరి సత్తి..!!

తెలంగాణలో ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నారు..BRS, కాంగ్రెస్ పార్టీలలోకి వలసల పర్వం కొనసాగుతూ ఉన్నప్పటికీ.. ఒకపక్క పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి చేరుతూ ఉండగా ఇప్పుడు అదే స్థాయిలో అధికార పార్టీ ఆయన బిఆర్ఎస్ లోకి చేరుతూ ఉన్నారు పలువురు నేతలు సినీ సెలబ్రిటీలు. తాజాగా ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి సైతం బిఆర్ఎస్ లోకి చేరినట్లుగా తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది BRS.. గత […]

కేసీఆర్‌పై మోదీ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బాగోతాన్ని మీకు చెబుతున్నానంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. బీఆర్ఎస్ పాపాలను ఒక్కొక్కటి బయటకు తీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా బీజేపీ జనగర్జన సభలో ప్రసంగించిన ప్రధాని.. ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం మీకు చెబుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు బీఆర్ఎస్‌, […]

కాంగ్రెస్‌లో ‘బీసీ’ ఇష్యూ..సీట్లు లేవా?

తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీట్ల ఎంపిక పెద్ద టాస్క్ అయిపోయింది. ఓ వైపు బి‌ఆర్‌ఎస్ సీట్లు ఖరారు చేసుకుని దూసుకెళుతుంది. కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దీంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒకో సీటుకు కనీసం ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. కొన్ని సీట్లకు పది మందిపైనే పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక తలనొప్పిగా మారింది. అందులో ఆర్ధికంగా, […]

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్..? త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన…?

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ త్వరలో కేంద్ర పాలిత కేంద్రం కానుందా..? హైదరాబాద్‌ను యూటీ (యూనియన్ టెరిటరీ) గా చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందా..? హైదారబాద్ యూటీకి సంబంధించి త్వరలో కీలక ప్రకటన రానుందా..? అంటే అవుననే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృతమైన ప్రచారం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. హైదరాబాద్‌ను యూటీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. దీనికి […]

కమలంలో కల్లోలం..కాంగ్రెస్‌కు ప్లస్.!

కొన్ని నెలల ముందు వరకు తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బి‌జే‌పినే అనే పరిస్తితి. కానీ ఇప్పుడు టోటల్ సీన్ రివర్స్ అయింది. బి‌జే‌పి మళ్ళీ యథావిధిగా 2018 ఎన్నికల్లో ఎలాంటి బలం ఉందో..అంతే బలానికి పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో బి‌జే‌పికి ఒక సీటు రాగా, 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడం, బండి సంజయ్ అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేయడం, రెండు ఉపఎన్నికల్లో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో […]

ఆరు గ్యారెంటీలు..కాంగ్రెస్ ఆశలు ఇవే.!

ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కష్టపడుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రజలని కోరుతున్నారు. తెలంగాణ పొరాడి సాధించారని కే‌సి‌ఆర్‌ని రెండుసార్లు ప్రజలు గెలిపించారు. కానీ తెలంగాణ ఇచ్చిన తమ పార్టీని ప్రజలు ఒక్కసారి ఆదరించాలని కోరుతున్నారు. అయితే రాజకీయంగా అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాంటి పార్టీని ఢీకొట్టి అధికారం సొంతం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. కానీ […]

టార్గెట్ కవిత: కమలానికి మైలేజ్.?

తెలంగాణలో మొన్నటివరకు బి‌జే‌పి చాలా బలమైన పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. పలు విజయాలు దక్కించుకుని బి‌జే‌పి సత్తా చాటి..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా రాజకీయం చేసింది. కానీ ఒక్కసారిగా బి‌జే‌పిలో మార్పులు, అధ్యక్షుడుని మార్చడంతో సీన్ మారిపోయింది. బి‌జే‌పి రేసులో వెనుకబడింది. ఇప్పుడు కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్‌ల మధ్యే పోరు నడుస్తోంది. ఇలా బి‌జే‌పి వెనుకబడిన నేపథ్యంలో పార్టీకి మైలేజ్ పెంచడానికి కేంద్రం పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో లిక్కర్ స్కామ్ లో వేగంగా పావులు కదుపుతున్నారని […]

కేవీపీ-కిరణ్‌లతో కాంగ్రెస్-కమలానికి డ్యామేజ్.!

తెలంగాణ ఎన్నికలు వస్తే చాలు..తెలంగాణ సెంటిమెంట్ అనేది తీసుకురావడం బి‌ఆర్‌ఎస్ పార్టీకి అలవాటైన పని. ఇప్పటివరకు అదే సెంటిమెంట్ తో బి‌ఆర్‌ఎస్ గెలుస్తూ వస్తుంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా గెలిచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో టి‌డి‌పి పొత్తు పెట్టుకుంది. దీన్ని కే‌సి‌ఆర్ అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అదిగో చంద్రబాబు మళ్ళీ తెలంగాణ పై పెత్తనం చెలాయించడానికి వస్తున్నారని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్దిపొందారు. అయితే ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే […]