పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన బిత్తిరి సత్తి..!!

తెలంగాణలో ఎన్నికలకు అన్ని పార్టీలు కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధపడుతున్నారు..BRS, కాంగ్రెస్ పార్టీలలోకి వలసల పర్వం కొనసాగుతూ ఉన్నప్పటికీ.. ఒకపక్క పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి చేరుతూ ఉండగా ఇప్పుడు అదే స్థాయిలో అధికార పార్టీ ఆయన బిఆర్ఎస్ లోకి చేరుతూ ఉన్నారు పలువురు నేతలు సినీ సెలబ్రిటీలు. తాజాగా ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి సైతం బిఆర్ఎస్ లోకి చేరినట్లుగా తెలుస్తోంది.

ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది BRS.. గత రెండు రోజుల నుంచి బిత్తిరి సత్తితో పలు ఊరు నాయకులు సైతం సంప్రదింపులు జరిపి పార్టీ వారికి ప్రెసిడెంట్ కేటీఆర్..మంత్రి హరీష్ రావు బిత్తిరి సత్తి తో చర్చలు జరిపించి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ముదిరాజ్ సామాజిక వర్గంలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన పాత్రలు పోషించిన వారు ఉన్నారని అందుకే వారిని టిఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా చేయడానికి ఆహ్వానించామని కేటీఆర్ హరీష్ రావు తెలియజేయడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీలోకి చేరినట్లుగా బిత్తిరి సత్తి తెలియజేయడం జరిగింది.

బిత్తిరి సత్తి మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే మాటలు ముఠాలు మంటలు అని రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉండాలి అని బలహీనమైన న్యాయకత్వం ఉండాల అంటూ ఆలోచించమంటూ తెలిపారు.. ఇటువైపు కేసీఆర్ గారు ఉన్నారు అవతల వైపు నుంచి ఎవరు ఉన్నారన్న ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసిన ఈసారి కచ్చితంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారంటూ తెలిపారు.. కెసిఆర్ గారు రైతుల ఎజెండా అయితే వారిది బూతుల జెండా అంటూ తెలిపారు. చాలామంది సెలబ్రిటీల సైతం హైదరాబాద్ అభివృద్ధి చూసి చాలా ఆశ్చర్యపోయారు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో సన్నీడియోల్ మరికొంతమంది హైదరాబాద్ గురించి పొగడడం జరిగింది అంటూ తెలిపారు.