గ్రాండ్ గా హీరో అర్జున్ కుమార్తె నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్..!!

కోలీవుడ్, టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక పాపులారిటీ సంపాదించుకున్నారు హీరో అర్జున్ సర్జా ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉన్నారు.. తమిళంలోనే కాకుండా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించారు. ఈ మధ్యనే లియో సినిమాలో కూడా నటించడం జరిగింది అర్జున్. అర్జున కు ఇద్దరు కుమార్తెలు అందులో ఐశ్వర్య సర్జ హీరోయిన్గా కొనసాగుతోంది.

అయితే ప్రముఖ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతి ఐశ్వర్య ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి ప్రేమకు ఇరువురు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహం కూడా జరగబోతున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు పలు రకాల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఉమాపతి కూడా హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నారు. వీరి పెళ్లి డిసెంబర్లో జరగబోతున్నట్లు సమాచారం. నిశ్చితార్థ వేడుకలు చాలా గ్రాండ్గా జరిగినట్లు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం అర్జున్ సినిమాలలో బిజీగా ఉన్నారు కూతురు ఐశ్వర్య స్టార్ హీరోయిన్గా చేయాలని చాలా కష్టపడిన పెద్దగా వర్కౌట్ కాలేక పోయింది. తెలుగు తెరకు పరిచయం చేయాలనుకున్నప్పటికీ అక్కడ కూడా విఫలమయ్యారు. అయితే గతంలో విశ్వక్ తో తన కూతుర్ని పెట్టి ఒక సినిమా చేయాలనుకున్న అది మధ్యలో ఆగిపోయింది.దీంతో ఈ సినిమాని మరో హీరోతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయబోతున్నారట అర్జున్ సర్జా.. ప్రస్తుతం అర్జున్ సబ్జక్ కూతురికి సంబంధించి ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.