టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

హీరో రవితేజ మొదటిసారి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఆ చిత్రమే టైగర్ నాగేశ్వరరావు.. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించడం జరిగింది. స్టువర్టపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ ని తెచ్చుకోవడం జరిగింది. ఇందులో హీరోయిన్స్ గా నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు.

ఇందులో కీలకమైన పాత్రలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళి శర్మ నటించారు ఈనెల 20వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కావడం జరిగింది. అయితే ఈ సినిమాతో పోటీగా భగవంత్ కేసరి , లియో వాటి పెద్ద సినిమాలు కూడా విడుదల కావడం జరిగింది.దీంతో సినిమాల కలెక్షన్స్ పై అభిమానులు చాలా కన్ఫ్యూజన్ తో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా కలెక్షన్ విషయాలను తెలియజేస్తూ టైగర్ నాగేశ్వరరావు టీం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా నిర్మాతలు కలెక్షన్ గురించి ఒక ట్విట్ చేస్తూ నేటితో మొదటి వారం పూర్తి చేసుకోవడంతో మొదటి వీక్ కలెక్షన్స్ ఎంత వచ్చాయని విషయాన్ని తెలియజేశారు. మొదటి వారంలో సుమారుగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలియజేశారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ 35 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సావ్వేదించాలి అంటే సుమారుగా 70 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉండగా 37 కోట్ల రూపాయలు రాబట్టాలి. మరి ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి మరి.