సినిమాల కోసం అలాంటి పనులు చేసిన స్టార్ 9 మంది నటులు వీళ్లే..కలలో కూడా మర్చిపోలేని త్యాగం..!!

ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ప్రతిఒక్కరూ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఉద్యోగం సాధించిన తరువాత మరో లక్ష్యం వైపు అడుగులు వేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అలా సినిమా రంగంపై ఆసక్తి ఉన్న కొందరూ నటులు ప్రభుత్వ ఉద్యోగాలు వదులుకుని సినిమా రంగంలో అడుగుపెట్టి పెద్ద స్టార్లుగా ఎదిగారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాజ్ కుమార్:


41 దశకం చివరిలో రాజ్ కుమార్ ముంబై కి వెళ్లి అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు. బాలీవుడ్ లో కెరీర్ ను కొనసాగించేందుకు తన ఉద్యోగాన్ని త్యాగం చేశాడు.

2. దిలీప్ కుమార్:
ఈయన ఔంద్ పూణేలో మిలటరీ క్యాంటీన్ ను నడిపేవాడు. బాలీవుడ్ నటి దేవిక రాణి అతన్ని గుర్తించి బాలీవుడ్ లో ఆఫర్ ఇచ్చింది. ఇక అప్పటినుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు.

3. రజనీకాంత్:
రజిని ఒకప్పుడు బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్గా పనిచేశారు. ఈయన నటుడుగా మారడం కోసం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.

4. శివాజీ సతమ్:


ఏపీసి ప్రద్యుమన్ పాత్రలో పాపులర్ అయిన ఈయన.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ గా పనిచేసేవాడు. కానీ నటనపై ఆసక్తితో తన ఉద్యోగాన్ని త్యాగం చేశాడు.

5. అమోల్ పాలేకర్:
అమోల్ పాలేకర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవాడు. అనంతరం ఉద్యోగాన్ని వదిలి బాలీవుడ్లో కెరీర్ ను కొనసాగించాడు.

6. దేవ్ ఆనంద్:
ఈయన మొదట్లో సెన్సార్ బోర్డ్ క్లార్క్ గా పనిచేసేవాడు. అనంతరం సినిమాపై ఆసక్తితో సినిమా రంగంలో అడుగు పెట్టాడు.

7. జానీ వాకర్:


ఈయన కెరీర్ మొదట్లో బస్ కండక్టర్ గా పనిచేసేవాడు. అనంతరం బాలీవుడ్లోకి అడుగుపెట్టి గొప్ప హాస్య నటుడుగా గుర్తింపు చెందాడు.

8. అమ్రిష్ పూరి:
ఈయనకి మొదట్లో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. కానీ నటనపై ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు.

9. బాల్ రాజ్ సాహ్మి:


ఈయన నటుడుగా మారకముందు బెంగాల్ లోని శాంతినికేతన్ లోని విశ్వభారతి విద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేశాడు.