అప్పుడు అలా… ఇప్పుడు ఇలా… సినిమాల మోజులో ఈ బ్యూటీస్ ఏం చేశారో తెలుసా…!!

ఒకప్పటి కాలంలో మనందరిని అలరించిన హీరోయిన్స్ అందరూ మనకు గుర్తుండే ఉంటారు. వారిలో కొంతమంది ఇప్పుడు వ్యక్తిగత కారణాలవల్ల కొంచెం లావు అయ్యారు. ఆ నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాధ:


ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రాధ. ఈమె సినీ ఇండస్ట్రీకి దూరమైన అనంతరం లావుగా అయిపోయింది.

2. ఖుష్బూ:
తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది ఖుష్బూ. కొంతకాలం క్రితం విడుదలైన అజ్ఞాతవాసి సినిమాలో ఈమె ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఒకప్పుడు ఈమె కూడా చాలా లావుగా ఉండింది. కానీ ఇప్పుడు చాలా స్లిమ్ గా తయారయింది.

3. రక్షిత:
ఇడియట్, పెళ్ళాం ఊరెళితే, నిజం ఇలా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది రక్షిత. ప్రస్తుతం ఈమెను చూస్తే ఆమెనా అనే సందేహం కలిగేలా లావైపోయింది. లావు తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

4. రంభ:


ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులని ఆకట్టుకుని మంచి గుర్తింపును దక్కించుకుంది రంభ. ప్రస్తుతం ఈమె అధిక బరువుతో బాధపడుతుంది.

5. రాశి:
చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది రాశి. ఈమె కూడా బరువు తగ్గి ముందులాగా స్లిమ్ గా తయారయ్యేందుకు ప్రయత్నం చేస్తుంది.

6. మీనా:
ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి తెలుగు, తమిళ్, మలయాళం లో ఎన్నో సినిమాల్లో నటించింది. ఈమె కూడా నాజూగ్గా తయారయ్యి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

7. రవళి:


ఈమె కూడా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ప్రస్తుతం అధిక బరువుతో బాధపడుతుంది.

8. నగ్మా:
నగ్మా కూడా తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా అనేక సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఈమె కూడా స్లిమ్ గా అయ్యేందుకు ప్రయత్నిస్తుంది.

ఒకప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం అందాన్ని బంగారంలా కాపాడుకుంటూ వచ్చిన ఈ హీరోయిన్స్… ఇప్పుడు ఆ అందం కోసం కడుపునిండా అన్నం తినడం కూడా మానేసి రోగాల బారిన పడుతున్నారు. నానా రకాల డైటింగ్ చేస్తూ ఒకప్పటి అందం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ బ్యూటీస్ అనుకున్న విధంగా మారతారో లేదో చూడాలి మరి.