హైపర్ ఆది పైన షాకింగ్ కామెంట్స్ చేసిన నటి పావలా శ్యామల..!!

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు.. తాజాగా ఇప్పుడు నటి పావలా శ్యామల హైపర్ ఆది పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. హైపర్ ఆది జబర్దస్త్ షోలో తనని చనిపోయిన వాళ్ళ ఫోటో పక్కన పెట్టి తాను కూడా చనిపోయినట్లు చిత్రీకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి స్కిట్లు చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది అని తెలిపింది.

పావలా శ్యామల ఎన్నో చిత్రాలలో వెండితెర పైన సహజ నటిగా నటించిన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈమె తన కూతురు ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని తెలియజేయడం జరిగింది. తాజాగా జబర్దస్త్ షో గురించి హైపర్ ఆది గురించి ఆమె స్పందించడం జరిగింది. జబర్దస్త్ లాంటి షోలు చనిపోయిన వాళ్ళ ఫోటో పక్కన తన ఫోటో చూసి చాలా సార్లు చనిపోయానేమో అని భావన అందరికీ కలిగించేలా చేశారని తెలుపుతోంది పావలా శ్యామల.

హైపర్ ఆది ఒక స్కిట్లో నిర్మలమ్మ ఫోటో మనోరమ ఫోటో పక్కన తన ఫోటో పెట్టి ఈవిడ ఎవరో తెలుసా ఈవిడ కూడా ఇప్పుడు లేరు అన్నంతగా చెప్పేశారు పోయిన వాళ్ళ ఫోటో పక్కన తన ఫోటో ఉంచి ఇలా చెప్పడం సరికాదు అంటు.. నడవలేని పరిస్థితిలో ఉన్న నేను.. జబర్దస్త్ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని వెళ్లి ఎందుకు మాట్లాడావు నీతో ఎవరు మాట్లాడించారని హైపర్ ఆది కాలర్ పట్టుకుని అడగాలనుకున్నాను..కనీసం తను బతికున్న లేదా అనే విషయాన్ని ఫోన్ చేసి కూడా అడగలేదని తెలిపింది పావలా శ్యామల.. ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండి అంటు తెలుపుతోంది.