కమలంలో ఆరని చిచ్చు..మాజీ సీఎంతో చిక్కులు.!

తెలంగాణ బి‌జే‌పిలో అంతర్గత పోరు ఆగేలా లేదు..బండి సంజయ్‌All Postsని అధ్యక్ష పదవి నుంచి తప్పించక ముందు నుంచి కమలంలో చిచ్చు రగులుతుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన స్టేజ్ పైనే బి‌జే‌పిలో విభేదాలు కనిపించాయి. ఈ క్రమంలో బండి సంజయ్..సొంత పార్టీలోని కొందరు నేతలని టార్గెట్ చేసి..జాతీయ నాయకత్వానికి తనపై కొందరు లేనిపోని ఫిర్యాదులు చేశారని, ఇకనైనా అలాంటి వాటిని మానుకోవాలని హితవు పలికారు. కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని అన్నారు.

అయితే బండిని అధ్యక్ష పీఠం నుంచి దింపే ముందు..ఢిల్లీకి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..వారే అధిష్టానానికి ఫిర్యాదులు చేశారని తెలిసింది. అందుకే తర్వాత బండిని తప్పించి కిషన్ రెడ్డిని పెట్టారనే టాక్ ఉంది. ఇక వారిని ఉద్దేశించే బండి ఇప్పుడు కామెంట్లు చేశారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మాజీ సి‌ఎం కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు..అయితే ఈయన తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడారు. తాను కాంగ్రెస్ లో సి‌ఎంగా ఉండగా..సమైక్యాంధ్ర కోసం పోరాడారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేయడానికి చూశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో అదే స్టేజ్ పై ఉన్న విజయశాంతి..కిరణ్ ఉన్నారని చెప్పి వెంటనే వెనుదిరిగారు. ఇక ఇలా సడన్ గా స్టేజ్ దిగి వెళ్లిపోవడంపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై విజయశాంతి స్పందిస్తూ.. ‘బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు.అది, సరి కాదు.. కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను. ఐతే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది..జై శ్రీరామ్.. హర హర మహాదేవ.. జై తెలంగాణ’ అని విజయశాంతి తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీని బట్టి చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఉండటం వల్లే విజయశాంతి వెళ్లిపోయారని తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే తెలంగాణ బి‌జే‌పిలో అంతర్గత విభేదాలు ఉన్నాయని తెలుస్తుంది.