ఒకప్పుడు సైడ్ డ్యాన్సర్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఈమె ఎవరో గుర్తుపట్టారా..?!

ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు అడుగుపెడుతూ ఉంటారు. వారు స్టార్ సెలబ్రెటీగా మారెందుకు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో చిన్న చిన్న పాత్రలో నటించి తర్వాత హీరో, హీరోయిన్గా అవకాశాలు అందుకునే స్టార్ సెలబ్రిటీస్ గా మారిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ త్రిష దగ్గర నుంచి లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ సాయి పల్లవి వరకు చాలామంది పేర్లు వినిపిస్తాయి. వీరంతా గతంలో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించి మెప్పించిన వారే కావడం విశేషం.

Kajal Aggarwal s SURPRISE CONDITION to Producer and Director who DEMAND THAT

ఇక‌ 7\జి బృందావన్ కాలనీ మూవీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నెగెటీవ్ టాక్ వ‌చ్చినా.. ఈ మూవీ తర్వాత పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అయిన ఈ మూవీలో ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సైడ్ డ్యాన్సర్ గా నటించింది. ఇంతకీ పై ఫోటోలో హీరో సైడ్ లో నుంచొని డ్యాన్స్ వేస్తున్న ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు కాజల్ అగర్వాల్. కాజల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు సైడ్ రోల్స్ లోను, సైడ్ డ్యాన్సర్గాను పలు సినిమాల్లో మెప్పించింది.

Kajal Aggarwal rings in husband Gautam Kitchlu's birthday with son Neil,  calls him 'best papa in the whole world' | Telugu News - The Indian Express

అలాగే 7\జీ బృందావన్ కాలనీలోను ఓ పాటలో తళుక్కుల మెరిసింది. అయితే తరువాత లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్గా ఛాన్స్ రావడం.. సినిమా హిట్ కావడంతో చందమామ, మగధీర ఇలా వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఒక్కసారిగా వరుస హిట్లు రావడంతో స్టార్ హీరోలు అందరి సరసన సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. తర్వాత పెళ్లి చేసుకుని చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా సినిమాల్లో రి ఎంట్రీ ఇచ్చి బాలయ్య నటించిన భగవంత్‌ కేసరిలో మెప్పించింది. ప్రస్తుతం సత్యభామతో ప్రేక్షకులు ముందుకు రానుంది.