నేను అప్పుడే బోర్ కొట్టేశానా.. నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు దిమ్మ‌తిరిగే బ‌దులిచ్చిన‌ డీజే టిల్లు బ్యూటీ!

నేహా శెట్టి.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెహబూబా మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. `డిజే టిల్లు` తో ఫ‌స్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా కాస్త నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో నేహా శెట్టి అద‌ర‌గొట్టింది. ప్ర‌స్తుతం ఈ భామ రెండు సినిమాల్లో న‌టిస్తోంది.

అందులో `బెదురులంక 2012` ఒక‌టి కాగా.. రెండో సినిమా `రూల్స్ రంజ‌న్‌`. బెదురులంక 2012లో కార్తికేయ హీరోగా చేస్తున్నాడు. అలాగే రూల్స్ రంజ‌న్ లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరో. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ రెండు చిత్రాలు త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా నేహా శెట్టి సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా నెటిజ‌న్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు చెప్పింది.

ఈ వ‌ర‌ల్డ్ లో ఇష్ట‌మైన ప్ర‌దేశం ఏద‌ని ప్ర‌శ్నించ‌గా.. అందుకు నేహా శెట్టి న్యూయార్క్ అని స‌మాధానం చెప్పింది. అలాగే తాను ఇంగ్లీష్, కన్నడ, హిందీ, తెలుగు, తుళు, కొడవ తక్ భాషలు మాట్లాడ‌గ‌ల‌న‌ని ఆమె పేర్కొంది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ మీ రిటైర్మెంట్ ఎప్పుడు..? అంటూ ప్ర‌శ్నించ‌గా.. నేహా దిమ్మ‌తిరిగే బ‌దులిచ్చింది. నేను అప్పుడే మీకు బోర్ కొట్టేశానా అంటూ బ‌దులిచ్చింది. దీంతో ఆమె ఆన్స‌ర్ వైర‌ల్ గా మారింది.