“కుబేర” సినిమాలో నాగ్ పాత్రను మిస్ చేసుకున్న.. ఆ అన్ లక్కి స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండడం చాలా చాలా కామన్ . సర్వ సాధారణమైన విషయమే అన్న సంగతి మనందరికీ తెలుసు . అయితే కొన్నిసార్లు అలా మంచి మంచి పాత్రలను మిస్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఒక బడా హీరో చేయాల్సిన పాత్రను మరొక బడా హీరో చేస్తే.. ఆ పాత్ర జనాలకు బాగా రీచ్ అయితే ఆ బాధ వర్ణాతీతం. ప్రజెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫీల్ గుడ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శేఖర్ కమ్ముల ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా కుబేర. ధనుష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ఉండగా నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు . దీనికి సంబంధించిన చిన్న వీడియో కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్ . అంతేకాదు నాగార్జున లుక్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి . ఆ వీడియో ఆధారంగా నాగార్జున ఈ సినిమాలో బాగా రిచ్ .. సౌండ్ పార్టీగా కనిపించబోతున్నాడు అంటూ తెలుస్తుంది .

అయితే నిజానికి ఈ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ ని చూస్ చేసుకున్నారట మేకర్స్ . కానీ కొన్ని కారణాల చేత అమితాబచ్చన్ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత పలువురు కోలీవుడ్ హీరోలను సైతం ఈ పాత్ర కోసం చూస్ చేసుకున్నారట . వాళ్ళు రిజెక్ట్ చేయడంతో ఫైనల్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఇంటిపేరుతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న నాగార్జున ను ఈ పాత్రకు చూస్ చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఆయన ఓకే చేయడంతో దీనికి సంబంధించిన షూట్ కూడా మొదలుపెట్టేసారు..!!